Australian Open 2025 : ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 11వ టైటిల్‌పై కన్నేసిన సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్ దూకుడుగా ఆడాడు. శుక్రవారం పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో 6-1, 6-4, 6-4తో చెక్ రిపబ్లిక్ ప్లేయర్ మచాక్‌పై గెలిచి ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. తొలి రెండు మ్యాచుల్లో ఒక్కో సెట్ కోల్పోయిన నొవాక్, ఆ తర్వాతి మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చలాయించాడు. 28 విన్నర్లు కొట్టి, కేవలం 20 అనవసర తప్పిదాలు మాత్రమే చేశాడు. అంతేకాకుండా 9 ఏస్‌లూ సంధించాడు.
తొలి రెండు మ్యాచ్లో ఒక్కో సెట్ కోల్పోయిన నొవాక్, ఈ మ్యాచ్లో మాత్రం పూర్తి ఆధిపత్యం చూపించాడు. మ్యాచ్లో 28 విన్నర్లు కొట్టిన అతను, 20 అనవసర తప్పిదాలు మాత్రమే చేశాడు. 9 ఏస్‌లు సంధించాడు. రెండో సెట్ ఆరంభంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైనప్పటికీ, కోర్టులోనే చికిత్స తీసుకున్న తర్వాత రాణించాడు.
మరోవైపు రెండో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 6-3, 6-4, 6-4తో జేకబ్ (బ్రిటన్) పై, మూడో సీడ్ అల్కరాస్ (స్పెయిన్) 6- 2, 6-4, 6-7 (3-7), 6-2తో బోర్గెస్ (పోర్చుగల్)పై నెగ్గారు. మెన్సిక్వై 3-6, 4-6, 7-6 (9-7), 6-4, 6-2తో పైచేయి సాధించిన డేవిడోవిచ్ (స్పెయిన్) 2005 తర్వాత ఈ టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ తొలి రెండు సెట్లు కోల్పోయి గెలిచిన తొలి ఆటగాడిగా నిలిచాడు.
సబలెంక సత్తా : మహిళల సింగిల్స్‌లో వరుసగా!
మూడో సారి విజేతగా నిలవాలనే పట్టుదలతో సబలెంక సత్తాచాటుతోంది. ఈ బెలారస్ భామ మూడో రౌండ్‌లో 7- 6 (7-5), 6-4తో టాసన్ (డెన్మార్క్)పై విజయం సాధిం చింది. తొలి సెట్లో ప్రత్యర్థి నుంచి ఈ ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణికి గట్టి పోటీ ఎదురైంది. అయితే ఆ సెట్ హోరాహోరీగా సాగి టై బ్రేకర్‌కు మళ్లింది.