Bumrah Border Gavaskar Trophy :టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ఆసీస్ మాజీ ఆటగాడు మెక్ గ్రాత్ ప్రశంసల వర్షం కురిపించాడు. బుమ్రాకు తానొక పెద్ద అభిమానినని తెలిపాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో బుమ్రా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేయకపోతే, సిరీస్ ఆసీస్‌కు అనుకూలంగా ఉండేదని అభిప్రాయపడ్డాడు. జనవరి 3నుంచి సిడ్నీలో ఐదో టెస్టు జరగనున్న నేపథ్యంలో మెక్ గ్రాత్ మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
'భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా కీలక ప్లేయర్. బుమ్రా లేకపోతే బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ఏకపక్షంగా సాగేది. బుమ్రా ఒక అద్భుతమైన బౌలర్. బుమ్రా బౌలింగ్‌లో కొంచెం హైపర్ ఎక్స్ టెన్షన్ ఉంటుంది. అది నా బౌలింగ్‌లో కూడా ఉండేది. బుమ్రా తన బౌలింగ్‌లో నియంత్రణను కలిగి ఉన్నాడు. నేను బుమ్రాకు పెద్ద ఫ్యాన్' అని మెక్ గ్రాత్ మీడియా సమావేశంలో బుమ్రాపై ప్రశంసలు కురిపించాడు.
ఆధిక్యంలో ఆసీస్
రీసెంట్గా మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో భారత్‌పై ఆసీస్ విజయం సాధించడంతో సిరీస్ లో పైచేయి సాధించింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 2-1 ఆధిక్యంలో ఉంది. సిడ్నీ వేదికగా జరిగే ఐదో టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్ సమం చేయాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది.