PM Modi Virtually Inaugurates Cherlapalli Railway Terminal : చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం జాతికి అంకితం చేశారు. సాంకేతికత, అత్యాధునిక సౌకర్యాలతో రూ.413 కోట్లతో చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను నిర్మించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీకి సీఎం శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి హాజరయ్యారు. గత సంవత్సరం డిసెంబరు 28న ఈ టెర్మినల్‌ను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే మాజీ ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ మరణంతో కార్యక్రమం వాయిదా పడింది.
రైల్వే కొత్త రూపు సంతరించుకుంది : ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ కనెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. దేశవ్యాప్తంగా మెట్రో నెట్‌వర్క్ వెయ్యి కిలో మీటర్లకు పైగా పరిధి విస్తరించిందని తెలిపారు. తెలంగాణ, ఒడిశా, జమ్మూ కశ్మీర్లో కొత్త కనెక్టివిటీకి ఏర్పాట్లు జరిగాయని వెల్లడించారు. ఒక్కో అడుగు వేసుకుంటూ దేశంలో కొత్త పుంతలు తొక్కిస్తున్నామని, రైల్వే రంగంలో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. ఆధునికీకరణతో పాటు ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగు పరుస్తున్నామని, దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి హైస్పీడ్ రైళ్లు పరుగులు పెడుతున్నాయని, వీటిలో స్లీపర్ వంటి సౌకర్యాలను కల్పించనున్నామని గుర్తు చేశారు. నూతన రైల్వే ట్రాక్‌లతో పాటు అండర్ బ్రిడ్జి నిర్మాణాలు వేగవంతం చేస్తున్నామని, చర్లపల్లి టెర్మినల్ ద్వారా సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుందని అన్నారు. దేశ వ్యాప్తంగా హై స్పీడ్ రైళ్ల కోసం డిమాండ్ పెరుగుతోందని వెల్లడించారు. దేశంలో 35% విద్యుదీకరణ పూర్తయిందని, అమృత్ భారత్, వందేభారత్, నమో భారత్ రైళ్లు తెచ్చామని గుర్తు చేశారు. దశాబ్ద కాలంలో రైల్వే కొత్త రూపు సంతరించుకుందని, రైల్వేల ఆధునికీకరణ దేశం ముఖచిత్రాన్నే మారుస్తోందని ఆయన అన్నారు.
తెలంగాణ, ఒడిశా, జమ్మూ కశ్మీర్లో కొత్త కనెక్టివిటీకి ఏర్పాట్లు జరిగాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేలా కృషిచేస్తున్నాం. రైల్వే రంగంలో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. హైస్పీడ్ రైళ్లకు డిమాండ్ పెరుగుతోంది- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
రాష్ట్రానికి కేంద్రం సహకారం కావాలి : చర్లపల్లి టెర్మినల్ ప్రారంభించిన సందర్భంగా రేవంత్ రెడ్డి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రం సహకరిస్తే తెలంగాణ రాష్ట్రం ట్రిలియన్ ఎకానమీ సాధిస్తుందని తెలిపారు. తెలంగాణకు డ్రైపోర్టు ఇవ్వాలని, ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణానికి సహకరించాలని, మెట్రో రైలు విస్తరణకు తోడ్పడాలని కోరారు.
ఇకపై 20 నిమిషాల్లోనే జూపార్క్ నుంచి ఆరాంఘర్ - అందుబాటులోకి నగరంలోనే రెండో అతిపెద్ద ఫ్లైఓవర్