Archery World Cup Final Deepika Kumari Silver Medal : భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకుంది. ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన ఆమెకు చైనా క్రీడాకారిణి లి జియామన్ చేతిలో ఓడించి. లి జియామన్ నుంచి దీపికకు ప్రతిఘటన గట్టిగానే ఎదురైంది. లి ప్రతి రౌండ్‌లో ఆధిపత్యం ప్రదర్శిస్తూనే ఉంది. దీంతో 0-6 తేడాతో దీపికాపై లి జియామన్ గెలుపొంది గోల్డ్ మెడల్‌ను దక్కించుకుంది.
వరల్డ్ కప్ ఫైనల్ - భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారికి సిల్వర్ మెడల్ - ARCHERY WORLD CUP FINAL 2024
ప్రపంచ కప్ ఫైనల్‌లో రజత పతకంతో సరిపెట్టుకున్న భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి
Published : Oct 21, 2024, 9:43 AM IST
దాదాపు 3 ఏళ్ల తర్వాత ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్‌కు అర్హత సాధించింది దీపికా. చివరి సారిగా 2022లో కుమార్తె జన్మించడం వల్ల ఆమె వరల్డ్ కప్ నుంచి వైదొలిగింది. అయితే ఈ సారి సెమీస్ వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండానే వచ్చినా దీపిక, ఫైనల్‌లో మాత్రం తడబాటుకు గురై ఓటమి పాలైంది. ఇప్పటి వరకు తొమ్మిది సార్లు ప్రపంచ కప్ తుది పోరులో పోటీ పడి ఐదు రజతాలను దక్కించుకుంది. ఒక కాంస్య పతకం కూడా సాధించింది. భారత్ తరఫున డోలా బెనర్జీ మాత్రమే గోల్డ్ మెడల్ సాధించడం గమనార్హం.