IMD Officer Interview on Sudden Changes in Weather : రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కప్పేస్తోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రధానంగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో పొగమంచు ఎక్కువగా కురుస్తుందని వాతావరణ శాఖ అధికారి రవీంద్రకుమార్ తెలిపారు. రాత్రి, తెల్లవారుజామున ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగానే కొనసాగుతున్నాయని, హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలకు పడిపోయాయని రవీంద్రకుమార్ తెలిపారు. రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో సాధారణ కనిష్ఠ ఉష్ణోగ్రతలే కొనసాగుతాయని వివరించారు. తూర్పు జిల్లాలైనా భద్రాద్రి, ఖమ్మం, ములుగు జిల్లాలో పొగ మంచు ఎక్కవగా ఉండే అవకాశాలున్నాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పొగ మంచు ఉంటుందని తూర్పు జిల్లాల్లో అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆగ్నేయం నుంచి గాలులు వీస్తున్నందుకు, మరోవైపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉన్నకారణంగా పొగ మంచు కురుస్తుందన్నారు.
ఎదురుగా ఉన్నా కనిపించట్లే! - లైట్లు వేసినా బండి ముందుకు కదలట్లే!!
"రాష్ట్రంలో పొగ మంచు జవవరి చివరి వరకు ఉంటుంది. ఉదయం, సాయంత్రం ప్రయాణాలు చేసేవాళ్లు జాగ్రత్త వహించాలి. పొగ మంచును బట్టి ప్రయాణాలు చేయాలి. వచ్చే వారం నుంచి పదిరోజుల మధ్యలో వర్షాలు కురిసే అవకాశముంది. వచ్చే వారం రోజులు కూడా వాతావరణం ఇలానే ఉంటుంది. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి." - రవీంద్రకుమార్, వాతావరణ శాఖ అధికారి
వచ్చే వారం రోజుల్లో వర్షాలు : రాబోయే నెల రోజుల పాటు రాష్ట్రంలో పొగ మంచు కురుస్తుందని రవీంద్రకుమార్ తెలిపారు. దట్టమైన పొగమంచు ఉంటున్న కారణంగా అత్యవసర ప్రయాణాలే చేయాలని సూచించారు. కాగా రాబోయే వారం నుంచి పది రోజుల మధ్య వర్షాలు కురిసే అవకాశముందన్నారు.
ఉదయం పూట ప్రయాణం చేస్తున్నారా? - రాబోయే 5 రోజులు జాగ్రత్త!
తెలంగాణ గజగజ! : ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు - సింగిల్ డిజిట్‌తో జనం బెంబేలు