తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

"2025లో ఈ రాశుల వారికి అఖండ రాజయోగం - మీ రాశి ఉందేమో చెక్​ చేసుకోండి"! - WHICH ZODIAC SIGN HAVE GOOD LUCK

-కొత్త సంవత్సరంలో అఖండ రాజయోగం కలిగే రాశులు ఇవేనట! - జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ ​కుమార్​ వెల్లడి

Which Zodiac Sign Have Good Luck in 2025
Which Zodiac Sign Have Good Luck in 2025 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 31, 2024, 1:44 PM IST

Which Zodiac Sign Have Good Luck in 2025: మరికొద్ది గంటల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ క్రమంలో చాలా మంది 2025లో తమ జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారు. ఏ విధమైన లాభాలు వస్తాయి? సమస్యలు ఏమైనా ఉంటాయా అని ఆలోచిస్తుంటారు. అయితే జ్యోతిష్యం ప్రకారం, 2025లో కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలొచ్చే అవకాశం ఉందని..అఖండ రాజయోగం కలిగే అవకాశం ఉందని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్​కుమార్​ చెబుతున్నారు. మరి ఆ రాశులు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

వృషభ రాశి: ప్రస్తుతం వృషభ రాశి వారికి కంటక శని దోషం నడుస్తోందని.. దీని వల్ల వృత్తి పరంగా ఇబ్బందులు ఎదురవుతాయని మాచిరాజు అంటున్నారు. అయితే 2025, మార్చి 30 తేదీన శని కుంభ రాశి నుంచి మీన రాశిలోకి మారుతున్నాడని.. అప్పటినుంచి వృషభ రాశి వారికి శని లాభ స్థానంలో సంచరిస్తాడని చెబుతున్నారు. ఈ ప్రభావంతో వృషభ రాశి వారికి వృత్తి పరంగా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని వివరిస్తున్నారు.

2025, మే 15వ తేదీ గురువు సంచారంలో మార్పు జరుగుతుందని.. ఈ కారణంగా ఈ రాశి వారికి డబ్బుకు లోటు ఉండదని చెబుతున్నారు. ఏ రంగంలో ఉన్నవారికైనా ధనం కలిసొస్తుందని, కుటుంబ జీవితం కూడా బాగుంటుందని చెబుతున్నారు. అలాగే మే 18న రాహు, కేతు మార్పుల కారణంగా.. అప్పటి నుంచి వృషభ రాశి వారికి రాహు అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు. విదేశాలకు వెళ్లి స్థిరపడే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.

తుల రాశి: ఈ రాశి వారికి కూడా 2025వ సంవత్సరంలో విపరీతమైన అదృష్టం కలిసొస్తుందని అంటున్నారు. మార్చి 30వ తేదీన శని సంచారంలో మార్పు కారణంగా.. తుల రాశి వారికి శని ఆరవ స్థానంలో ఉంటాడని చెబుతున్నారు. దీంతో భయంకరమైన శత్రు బాధలు తొలగిపోతాయని.. అలాగే భరించలేని అప్పులు కూడా తీరిపోతాయని పేర్కొంటున్నారు. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయని వివరిస్తున్నారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందంటున్నారు.

2025, మే 15వ తేదీ గురువు సంచారంలో మార్పు కారణంగా ఆరోజు నుంచి తుల రాశివారికి అష్టమ గురు దోషం తొలగిపోతుందని అంటున్నారు. ఈ దోషం తొలగిపోయి తొమ్మిదొవ స్థానంలో గురువు సంచారం మొదలవుతుందని.. ఊహించని విధంగా ధనప్రాప్తి కలుగుతుందని అంటున్నారు. కుటుంబ జీవితం బాగుంటుందని చెబుతున్నారు. మే 18వ తేదీ నుంచి రాహు, కేతు మార్పుల కారణంగా.. అప్పటి నుంచి తుల రాశి వారికి కేతువు అనుగ్రహం లభిస్తుందని తెలుపుతున్నారు.

Note :పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు, జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

"న్యూ ఇయర్​ రోజున ఈ మంత్రాలు చదివితే - ఏడాదంతా అదృష్టం, ఐశ్వర్యం మీ వెంటే"!

"న్యూ ఇయర్​ రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే - సంవత్సరమంతా విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి"!

ABOUT THE AUTHOR

...view details