ETV Bharat / offbeat

సండే స్పెషల్​: రెస్టారెంట్​ స్టైల్​ "చిల్లీ ఫిష్​" - ఇలా చేస్తే క్షణాల్లో ప్లేట్లు ఖాళీ కావాల్సిందే! - HOW TO MAKE CHILLI FISH AT HOME

-చేపలతో పులుసు, ఫ్రై మాత్రమే కాదు ఇలా స్టాటర్​ ట్రై చేయండి రుచి సూపర్​గా ఉంటుంది

How to Make Chilli Fish at Home
How to Make Chilli Fish at Home (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 5, 2025, 1:55 PM IST

How to Make Chilli Fish at Home: చేపలు.. ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే సండే రోజున ఎక్కువ మంది వీటిని తెచ్చుకుని తింటుంటారు. కేవలం సండే మాత్రమే కాదు.. ఎప్పుడు తినాలనిపించినా, ఇంటికి అతిథులు వచ్చినప్పుడైనా సరే వీటిని తీసుకొస్తుంటారు. ఇక చేపలతో పులుసు, ఫ్రై, పచ్చడి అంటూ ఎన్నో రకాలుగా చేస్తుంటారు. అయితే చేపలతో చేసుకునే రెసిపీలలో చిల్లీ ఫిష్​ కూడా ఒకటి. ఎక్కువ మంది వీటిని రెస్టారెంట్స్​కు వెళ్లినప్పుడు మాత్రమే ఆర్డర్​ పెట్టుకుని తింటుంటారు. కారణం ఇంట్లో తయారు చేసుకోవడం కుదరక. అయితే మేము చెప్పే ఈ టిప్స్​ పాటిస్తే ఇంట్లోనే చిల్లీ ఫిష్​ను ఈజీగా ప్రిపేర్​ చేసుకోవచ్చు. పైగా ఎంతో టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ ప్రిపేర్​ చేయడానికి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు. మరి ఈ స్టాటర్​కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు:

  • ముళ్లు తీసిన చేప ముక్కలు - అర కేజీ
  • ఉప్పు- రుచికి సరిపడా
  • కారం - 2 టీ స్పూన్లు
  • గరం మసాలా - 1 టీ స్పూన్​
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​ - 1 టీ స్పూన్​
  • మిరియాల పొడి - అర టీ స్పూన్​
  • నిమ్మరసం - అర చెక్క
  • కార్న్​ఫ్లోర్​ - 2 టేబుల్​ స్పూన్లు
  • మైదా - 2 టేబుల్​ స్పూన్లు
  • కోడిగుడ్డు - 1
  • నీళ్లు - 2 టేబుల్​ స్పూన్లు

టాసింగ్​ కోసం:

  • నూనె - 2 టేబుల్​ స్పూన్​
  • అల్లం తరుగు - 1 టేబుల్ స్పూన్​
  • వెల్లుల్లి తరుగు - 1 టేబుల్​ స్పూన్​
  • పచ్చిమిర్చి - 3
  • ఉల్లిపాయ ముక్కలు - పావు కప్పు
  • క్యాప్సికం ముక్కలు - పావు కప్పు
  • సోయా సాస్​ - 2 టేబుల్​ స్పూన్లు
  • చిల్లీ సాస్​ - 2 టేబుల్​ స్పూన్లు
  • టమాట సాస్​ - 1 టేబుల్​ స్పూన్​
  • ఉప్పు - పావు టీ స్పూన్​
  • నీళ్లు - పావు కప్పు
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ విధానం:

  • ముందుగా చేప ముక్కలను ముల్లుల్లు లేకుండా తీసి శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్​ చేసుకుని పక్కన పెట్టాలి.
  • మిక్సింగ్​ బౌల్​లోకి చేప ముక్కలు, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్​, మిరియాల పొడి, నిమ్మరసం వేసి మసాలాలన్నీ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత అందులోకి మైదా పిండి, కార్న్​ఫ్లోర్​, బీట్​ చేసుకున్న కోడిగుడ్డు, నీళ్లు పోసుకుని ముక్కలను బాగా కలిపి ఓ అరగంట పక్కన పెట్టాలి.
  • అరగంట తర్వాత స్టవ్​ ఆన్​ చేసి పాన్ పెట్టి డీప్​ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్​ కాగిన తర్వాత చేప ముక్కలను విడివిడిగా వేసి మీడియం ఫ్లేమ్​లో రెండు వైపులా ఎర్రగా కాల్చుకుని ఓ ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ, క్యాప్సికం ముక్కలు వేసి ఓ రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత సోయా సాస్​, చిల్లీ సాస్​, టమాట కెచప్​, ఉప్పు, నీళ్లు పోసి కలిపి దగ్గర అయ్యేంతవరకు ఉడికించుకోవాలి.
  • సాస్​లన్నీ మరుగుతున్నప్పుడు ఫ్రై చేసుకున్న చేప ముక్కలు వేసి హై ఫ్లేమ్​మీద రెండు నిమిషాలు టాస్​ చేసి కొత్తిమీర చల్లి స్టవ్​ ఆఫ్​ చేయాలి.
  • అంతే ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్​ స్టైల్​ చిల్లీ ఫిష్​ రెడీ. వేడివేడిగా తింటుంటే అద్దిరిపోతుంది. నచ్చితే మీరూ ఇంట్లో ట్రై చేయండి.

'ఆలూ మాసాలా సాండ్​విచ్' - ఇలా చేసి పెడితే - పిల్లలు 'మమ్మీ ఇట్స్​ టూ యమ్మీ' అనడం పక్కా!

ఈ స్నాక్స్​ వెరీ 'గుడ్డు' - ఇలా చేస్తే "సూపర్​ మమ్మీ" అంటూ లొట్టలేసుకుంటూ తింటారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.