TG Sankranti Holidays 2025 : బడికెళ్లే పిల్లలకు అన్నింటికంటే ఇష్టమైనవి సెలవులు. స్కూల్స్‌కు ఎప్పుడెప్పుడు హాలిడేస్ ఇస్తారా అని ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లి ఎంజాయ్ చేసేందుకు, ఫ్రెండ్స్‌తో కలిసి హాయిగా ఆడుకునేందుకు ఎప్పుడెప్పుడు టైమ్ దొరుకుతుందా అని చూస్తుంటారు. ముఖ్యంగా తెలంగాణలో పెద్ద పండుగలైన దసరా, సంక్రాంతి సమయాల్లో అయితే హాలిడేస్ ఎప్పుడొస్తాయా? అని పిల్లలే కాదు వారితో పాటు తల్లిదండ్రులు చూస్తుంటారు. వారి నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెడుతూ తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది.
జనవరి 11 నుంచి జనవరి 17వ తేదీ వరకు వారం రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పాఠశాలలు తిరిగి జనవరి 18న అంటే శనివారం తెరుచుకోనున్నాయి. సెలవులపై క్లారిటీ రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను సొంతూళ్లకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. సంక్రాంతి పండక్కి సొంతూరికి వెళ్లి స్నేహితులు, బంధువులతో కలిసి ఆనందంగా గడపేందుకు సిద్ధం అవుతున్నారు.
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి ఆర్టీసీ గుడ్‌న్యూస్ - 7వ తేదీ నుంచి ప్రత్యేక బస్సులు
ఆ సెలవులు మరవక ముందే : వారం రోజుల క్రితం క్రిస్మస్, బాక్సింగ్ డే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో డిసెంబరు నెల 25, 26, 27 ఇలా వరుసగా సెలవులు వచ్చాయి. ఆ తర్వాత జనవరి 1వ తేదీన ప్రభుత్వం పబ్లిక్ హాలిడే ప్రకటించింది. ఇలా గత డిసెంబర్లో వరుస సెలవుల నుంచి తేరుకునేలోపు వెంటనే సంక్రాంతి సెలవులు వచ్చేస్తున్నాయి. దీంతో విద్యార్థులు తెగ ఖుషీ అవుతున్నారు.
అన్ని హౌస్ ఫుల్ : ఇదిలా ఉండగా సంక్రాంతికి సొంతూళ్లకు వెళదామనుకునే వారికి ఈసారి ఇబ్బందులు తప్పేలా లేవు. ఎందుకంటే మూడు నెలల ముందు నుంచే ట్రైన్స్, బస్సులు బుక్ అయిపోయి ఉన్నాయి. రిజర్వేషన్ చేద్దామన్నా అక్కడ చాంతాడంత వెయిటింగ్ లిస్ట్ ఉంది. జనరల్ బోగీల్లో వెళదామంటే కాలు పెట్టే సందు కూడా లేదు. మొత్తానికి ఈసారి పండక్కి ఇంటికి వెళ్లి రావాలంటే జేబులు గుళ్ల చేసుకోవాల్సిందే. ఈ సంక్రాంతికి రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడపనుంది. అలాగే టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేకంగా 6,432 బస్సులను ఇతర ప్రాంతాలకు వెళ్లే వారిని గమ్యస్థానాలకు తీసుకెళ్లనుంది.
సంక్రాంతికి 6,432 ప్రత్యేక బస్సులు - ఆ తేదీల్లో నడపనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ వెల్లడి