Which Plants give Good Luck as per Numerology: ప్రతి ఒక్కరూ తమ జీవితంలో దురదృష్టం పోయి అదృష్టం కలిసి రావాలని కోరుకుంటారు. ఐశ్వర్యం సిద్ధించాలని ఆశపడతారు. ఈ క్రమంలోనే అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, అందరికీ విజయం అనేది లభించదు. అయితే.. సంఖ్యాశాస్త్రం ప్రకారం మీరు పుట్టిన తేదీని బట్టి కొన్ని చెట్లు నాటడం వల్ల అదృష్టం కలుగుతుందని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఇంతకీ, అదృష్టం కలిసి రావాలంటే ఏ చెట్లు నాటాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
1 - నెల, సంవత్సరంతో సంబంధం లేకుండా ఒకటవ తేదీన పుట్టిన వారు మేడి చెట్టును పెంచితే మంచిదంటున్నారు మాచిరాజు కిరణ్ కుమార్.
2 - రెండో తేదీన పుట్టిన వారు నేరేడు చెట్టును పెంచితే గ్రహదోషాలు తొలగిపోయి మంచి జరుగుతుందని సూచిస్తున్నారు.
3 - మూడో తేదీన జన్మించిన వారు వెదురు చెట్టును నాటితే మంచి ఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు.
4 - నాలుగో తేదీన పుట్టిన వారు వాక్కాయ చెట్టును నాటితే లక్ కలిసి వస్తుందట.
5 - ఈ తేదీన జన్మించిన వారు నారింజ చెట్టును పెంచితే మేలు జరుగుతుందని వివరిస్తున్నారు.
6 - ఉసిరిక చెట్టును ఆరవ తేదీన పుట్టిన వారు నాటితే శుభ ఫలితాలు కలుగుతాయని పేర్కొంటున్నారు.
7 - ఈ రోజున జన్మించిన వారు ముష్టి చెట్టును పెంచితే విశేష ఫలితాలు లాభిస్తాయంటున్నారు.
8 - వీళ్లు రావి చెట్టును పెంచడం వల్ల మంచి జరుగుతుందని చెబుతున్నారు. అయితే ఈ చెట్టును ఇంటి ఆవరణలో కాకుండా ఎక్కడైనా ఖాళీ స్థలంలో పెంచవచ్చని చెబుతున్నారు.
9 ఈ రోజున పుట్టిన వారు చండ్ర మొక్కను నాటితే మేలు జరుగుతుందని చెబుతున్నారు.
10 - ఈ తేదీన పుట్టిన వారు జువ్వి చెట్టును పెంచితే అదృష్టం విపరీతంగా కలిసి వస్తుందని అంటున్నారు.
11 - పోక చెట్టును ఈ తేదీన పుట్టిన వారు నాటితే విశేష ఫలితాలు లభిస్తాయని వివరిస్తున్నారు.
12 - వీళ్లు రేగు చెట్టు నాటితే మంచిదంటున్నారు.
13 - మద్ది చెట్టును నాటడం వల్ల ఈ తేదీన పుట్టిన వారికి మేలు జరుగుతుందని మాచిరాజు చెబుతున్నారు.
14 - ఈ తేదీన పుట్టిన వారు నీరుద్ది చెట్టును పెంచడం వల్ల అదృష్టం లభిస్తుందని చెబుతున్నారు.
15 - మోదుగ చెట్టును ఈ తారీఖున పుట్టిన వారు నాటితే మంచిదంటున్నారు. అయితే ఇంట్లో కాకుండా ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో నాటమని సలహా ఇస్తున్నారు.
16 - ఈ తేదీన జన్మించిన వారు మర్రి చెట్టు నాటాలని చెబుతున్నారు.
17 - పొగడ చెట్టును 17వ తేదీన పుట్టిన వారు నాటితే విశేష ఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు.
18 - ఈ తేదీన పుట్టిన వారు మారేడు మొక్కను పెంచితే మంచిదంటున్నారు.
19 - పనస చెట్టును ఈ తేదీన పుట్టిన వారు నాటితే మంచి జరుగుతుందని వివరిస్తున్నారు.
20 - ఈ తేదీన పుట్టిన వారు జిల్లేడు మొక్కలను పెంచితే అదృష్టం కలిసొస్తుందని చెబుతున్నారు.
21 - మామిడి మొక్కను ఈ తేదీన పుట్టిన వారు నాటితే ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు.
22 - ఈ తారీఖున పుట్టిన వారు గానుగ మొక్కను పెంచడం వల్ల లక్ కలిసి వస్తుందని సూచిస్తున్నారు.
23 - ఈ తేదీన పుట్టిన వారు జిల్లేడు మొక్కలను పెంచితే అదృష్టం కలిసొస్తుందని చెబుతున్నారు.
24 - మెట్ట చెట్టును పెంచితే ఈ తేదీలో జన్మించిన వారికి మంచిదంట.
25 వేగి చెట్టును పెంచితే ఈ తేదీలో పుట్టిన వారికి అదృష్టం కలిసొస్తుందని పేర్కొంటున్నారు.
26 - వేప చెట్టను పెంచడం వల్ల అనేక దోషాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందని వివరిస్తున్నారు.
27 - జమ్మి చెట్టును నాటడం వల్ల మేలు జరుగుతుందని సూచిస్తున్నారు.
28 - జువ్వి చెట్టును పెంచినా మంచి జరుగుతుందట.
29 - పోక చెట్టును ఈ తేదీన పుట్టిన వారు నాటితే విశేష ఫలితాలు లభిస్తాయని వివరిస్తున్నారు.
30 - ఈ తేదీన జన్మించిన వారు వెదురు చెట్టు నాటితే మంచి జరుగుతుందని చెబుతున్నారు.
31 - ఈ డేట్‌న పుట్టిన వారు వాక్కాయ చెట్టును నాటితే లక్ కలిసి వస్తుందని చెబుతున్నారు.
Note : పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు, జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
మీ శరీరం మీద ఈ ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉంటే - అఖండ రాజయోగం కలుగుతుందట!