ETV Bharat / offbeat

సంక్రాంతి స్పెషల్​ స్వీట్స్ : అద్దిరిపోయే "బూందీ లడ్డూ, బెల్లం గవ్వలు, గర్జలు" - సింపుల్​గా చేసుకోండిలా! - SANKRANTI 2025 SPECIAL SWEETS

సంక్రాంతికి ఈ స్వీట్ రెసిపీలు ట్రై చేయండి - ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు!

Sankranti 2025 Special Sweet Recipes
PONGAL 2025 Sweets (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 5, 2025, 1:24 PM IST

Sankranti 2025 Special Sweet Recipes : సరదాల సంక్రాంతికి తెలుగు లోగిళ్లన్నీ పిండి వంటలతో ఘుమఘుమలాడుతాయి. అరిసెలు, సకినాలు, గారెలు.. ఇలా వివిధ రకాల రెసిపీలు నోరూరిస్తాయి. పిల్లాపాపలతో ఉత్సాహంగా గడుపుతూ కొత్త రుచులను ఆస్వాదిస్తారు. అయితే, మరికొద్దీ రోజుల్లో ఏడాదిలో మొదటి పెద్ద పండగ సంక్రాంతి రానున్న వేళ ఇప్పటి నుంచే చాలా మంది ఈసారి కొత్తగా ఎలాంటి తీపి వంటకాలు చేయాలా అని ఆలోచిస్తుంటారు. అలాంటి వారికోసమే కొన్ని స్పెషల్ స్వీట్ రెసిపీలు తీసుకొచ్చాం. వాటిపై ఇప్పుడు ఓ లుక్కేయండి.

బూందీ లడ్డూలు :

కావాల్సిన పదార్థాలు :

  • శనగపిండి - అరకిలో
  • పంచదార - కేజీన్నర
  • కాజు - అర కప్పు
  • ఆయిల్ - తగినంత
  • కిస్​మిస్ - పావు కప్పు
  • యాలకుల పొడి - అరటీస్పూన్
  • పచ్చ కర్పూరం - చిటికెడు

తయారీ విధానం :

  • ముందుగా ఒక మిక్సింగ్​ బౌల్​లో జల్లించుకున్న శనగపిండిని తీసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకొని పక్కనుంచాలి. పిండి మరీ జారుగా, చిక్కగా ఉండకుండా కాస్త వాటర్ పోసి చిలుకున్న చిక్కని పెరుగులా ఉండాలి.
  • ఇప్పుడు స్టౌపై వెడల్పాటి మూకుడు పెట్టుకొని పంచదార, 750ఎంఎల్ వాటర్ వేసుకొని లేత తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. ఆవిధంగా పాకం వచ్చాక మూకుడుని దింపి పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం బూందీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై మరో కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక ఆయిల్​కి దగ్గరగా బూందీ గరిటెను ఉంచి ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా మొత్తం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత మీరు వేయించి తీసుకున్న బూందీని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలో వేసి కలుపుతూ ఉండాలి. బూందీ మొత్తం వేశాక ఒకసారి గరిటెతో పైకి కిందికి బాగా కలిపి కాసేపు అలా వదిలేయాలి. అంటే పూర్తిగా చల్లారనివ్వాలి. అలా చేయడం ద్వారా బూందీ పాకాన్ని చక్కగా పీల్చుకుంటుంది.
  • అనంతరం చల్లారిన బూందీని జల్లి గంటెలోకి తీసుకొని కాసేపు అలా వదిలేయాలి. ఇలా చేయడం ద్వారా బూందీలోని అదనపు పాకం దిగిపోతుంది.
  • ఆ తర్వాత బూందీని ఒక మిక్సింగ్ బౌల్​లోకి తీసుకొని జీడిపప్పు పలుకులు, కిస్మిస్, యాలకుల పొడి, పచ్చ కర్పూరాన్ని నలిపి వేసుకొని మిశ్రమం మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి.
  • అనంతరం మీకు నచ్చిన పరిమాణంలో లడ్డూలుగా చుట్టుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "బూందీ లడ్డూలు" రెడీ!

నోట్లో వేస్తే కరిగిపోయే "కమ్మని కలాకండ్​" - ఇలా చేస్తే అచ్చం స్వీట్​ షాప్​ టేస్ట్​!

బెల్లం గవ్వలు :

కావాల్సిన పదార్థాలు :

  • బొంబాయి రవ్వ - పావు కప్పు
  • మిల్క్ పౌడర్ - 2 టేబుల్​స్పూన్లు
  • మైదా - పావుకిలో
  • ఉప్పు - పావు చెంచా
  • నెయ్యి - 2 టేబుల్​స్పూన్లు
  • వంటసోడా - చిటికెడు
  • నూనె - వేయించడానికి తగినంత
  • బెల్లం - ఒకటిన్నర కప్పులు
  • యాలకుల పొడి - పావుటీస్పూన్

తయారీ విధానం :

  • ముందుగా మిక్సీ జార్ తీసుకొని బొంబాయి రవ్వ, మిల్క్ పౌడర్ వేసుకొని సన్నని రవ్వ మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి.
  • అనంతరం వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మైదా, గ్రైండ్ చేసుకున్న రవ్వ, ఉప్పు, నెయ్యి, వంటసోడా వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చేతి మణికట్టుతో గట్టిగా వత్తుతూ పూరీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఆపై పిండి ముద్దపై ఒక క్లాత్ ఉంచి 5 నిమిషాల పాటు అలా వదిలేయాలి.
  • 5 నిమిషాల తర్వాత పిండిని మూడు భాగాలు చేసుకోవాలి. ఒక్కో పిండి ముద్దను చేతితో పొడవుగా రోల్ చేసుకోవాలి. ఆ తర్వాత చాకుతో అంగుళం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఉండలుగా చేసుకోవాలి.
  • ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్​లో గవ్వల చెక్కను ఉంచి దానిపై ఒక్కో పిండి ఉండను పెట్టి చేతితో అదిమితే గవ్వల మాదిరిగా వస్తుంది. ఇలా అన్నింటిని చేసుకొని పక్కనుంచాలి.
  • అనంతరం స్టౌపై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొన్ని గవ్వలను వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మిగిలిన వాటిని అలాగే చేసుకోవాలి
  • ఆపై వాటిని ఒక ప్లేట్​లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఆలోపు బెల్లం పాకం ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై కడాయి పెట్టుకొని బెల్లం, 3 టేబుల్​స్పూన్ల వాటర్ వేసుకొని ముదురు పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి.
  • ఆవిధంగా పాకాన్ని పట్టుకున్నాక అందులో యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో చల్లార్చుకున్న గవ్వలను వేసి హై ఫ్లేమ్ మీద బాగా కోట్ చేసుకోవాలి.
  • పాకం మొత్తం గవ్వలకు పట్టుకున్నాక స్టౌ ఆఫ్ చేసుకొని దింపి 15 నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత జల్లెడలో వేసుకొని కాసేపు అలా ఉంచితే గవ్వలు పూర్తిగా ఆరిపోతాయి.
  • అప్పుడు వాటిని ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలు. అంతే.. సూపర్ టేస్టీ అద్దిరిపోయే "బెల్లం గవ్వలు" రెడీ!

మైదాపిండి చెగోడీలు ఆరోగ్యానికి హానికరం - ఇలా బియ్యప్పిండితో చేస్తే హెల్దీ అండ్ టేస్టీ!

గర్జలు(కజ్జికాయలు) :

కావాల్సిన పదార్థాలు :

స్టఫింగ్ కోసం :

  • నెయ్యి - అర కప్పు
  • జీడిపప్పు - అర కప్పు
  • బొంబాయి రవ్వ - ఒకటిన్నర కప్పులు
  • సన్నని ఎండుకొబ్బరి తురుము - అర కప్పు
  • షుగర్ సిరప్ - 1 కప్పు
  • యాలకుల పొడి - పావుటీస్పూన్

పిండి కోసం :

  • మైదా - పావుకిలో
  • శనగపిండి - ఒకటిన్నర టేబుల్​స్పూన్లు
  • ఉప్పు - కొద్దిగా
  • నెయ్యి - 2 టేబుల్​స్పూన్లు
  • నూనె - వేయించడానికి తగినంత

తయారీ విధానం :

  • ముందుగా స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం స్టౌపై కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. అది కరిగాక జీడిపప్పు పలుకులు వేసుకొని ఎర్రగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి.
  • మిగిలిన నెయ్యిలో బొంబాయి రవ్వ వేసుకొని లో ఫ్లేమ్ మీద మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక ఎండుకొబ్బరి తురుము వేసుకొని బాగా కలుపుతూ వేయించుకోవాలి. రవ్వ రంగు మారడం స్టార్ట్ అయ్యాక అందులో షుగర్ సిరప్ పోసుకొని కలిపి ఒక ఉడుకు రానిచ్చి స్టౌను లో ఫ్లేమ్​లోకి టర్న్ చేసుకోవాలి.
  • ఈ సమయంలో ఒకసారి టేస్ట్ చూసి తీపి సరిపోదనిపిస్తే రెండు మూడు చెంచాల చక్కెర యాడ్ చేసుకోవచ్చు.
  • ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసుకొని అందులో యాలకుల పొడి, వేయించుకున్న జీడిపప్పులను నలిపి వేసుకొని బాగా కలిపి అరగంట పాటు అలా వదిలేయాలి.

అన్నం మిగిలిపోయిందా? - ఓసారి ఇలా "జిలేబీలు" చేయండి - స్వీట్​ షాప్​ స్టైల్​ పక్కా!

  • ఈ లోపు గర్జల పిండిని సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం ఒక మిక్సింగ్ బౌల్​లో జల్లించుకున్న మైదా, శనగపిండి, ఉప్పు, నెయ్యి వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఆపై తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. తర్వాత పావుగంట పాటు అలా వదిలేయాలి.
  • అనంతరం పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఆ తర్వాత చపాతీ పీటపై కొద్దిగా పొడి పిండి వేసుకొని ఒక్కో పిండి ఉండను ఉంచి పూరీ మాదిరిగా రోల్ చేసుకోవాలి.
  • ఇప్పుడు గర్జల మౌల్డ్ తీసుకొని మీరు వత్తుకున్న పూరీ షీట్​ను ఉంచి మధ్యలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్​ని కొద్దిగా వేసుకోవాలి.
  • ఆ తర్వాత అంచులకు కాస్త వాటర్ అద్దుకొని గట్టిగా వత్తుకోవాలి. ఆపై మిగిలిన పిండిని తీసేయాలి. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక లో ఫ్లేమ్​లో ఉంచి మీరు ప్రిపేర్ చేసుకున్న గర్జలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి.
  • ఆపై మీడియం ఫ్లేమ్ మీద రెండు వైపులా ఎర్రగా కాలే వరకు వేయించుకొని తీసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "గర్జలు/కజ్జికాయలు" రెడీ!

పిండి లేకుండా చిలగడదుంపతో "గులాబ్​జామున్​" - నోట్లో వేసుకోగానే కరిగిపోతాయ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.