ETV Bharat / spiritual

"ఇంట్లో ఈ వస్తువులు ఉంటే - అదృష్టం, ఐశ్వర్యం మీ వెంటే!" - GOOD LUCK ITEMS IN HOME

జీవితంలో అదృష్టం కలిసి రావాలంటే - ఇంట్లో ఈ వస్తువులు ఉండాలంటున్న జ్యోతిష్యులు!

ASTROLOGY TIPS FOR GOOD LUCK
Good Luck Items in Home (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 2, 2025, 7:00 PM IST

Good Luck Items in Home : మన జీవితంలో అదృష్టం, దురదృష్టం అనే మాటలను తరచుగా వింటుంటాం. ముఖ్యంగా ఏదైనా కలిసి రావాలంటే అదృష్టం ఉండాలంటుంటారు చాలా మంది. ఇందుకోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, అందరికీ తొందరగా విజయం సిద్ధించదు. అలాకాకుండా, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులను అలంకరణగా ఏర్పాటు చేసుకోవడం, ఉంచడం చేయాలంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్. వాటి వల్ల గృహంలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడి అదృష్టాన్ని కలిగిస్తాయంటున్నారు. ఇంతకీ, అదృష్టాన్ని కలిగించే ఆ వస్తువులేంటో ఇప్పుడు చూద్దాం.

  • జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గృహంలో పిల్లన గ్రోవి ఉంటే చాలా మంచిదట. రెండు ఫ్లూట్​లను ఇంట్లో గోడకు 45 డిగ్రీల కోణంలో అలంకరణ వస్తువులా వేలాడదీస్తే అదృష్టం బాగా కలిసి వస్తుందంటున్నారు జ్యోతిష్యులు కిరణ్ కుమార్.
  • ఇంటి పై భాగంలో జెండాను ఏర్పాటు చేసుకోవడం కూడా ఉత్తమ ఫలితాలను ఇస్తుందంటున్నారు. తెలుపు, ఆకుపచ్చ, కాషాయం వంటి మూడు రంగులలో ఏదైనా ఒక రంగు త్రిభుజాకారం క్లాత్​ని ఇంటిపై వేలాడదీయడం కూడా గుడ్ లక్​ పొందడానికి సహకరిస్తుందంటున్నారు.
  • ప్రకృతివర్ణాల మిళితంలా అనిపించే నెమలి పింఛం ఇంట్లో ఉన్నా చాలా శుభకరం! ఇంటి ప్రధాన గుమ్మం పై భాగంలో రెండు నెమలి పింఛాలను V ఆకారంలో పసుపు దారంతో కడితే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించడంతో పాటు అదృష్ట లక్ష్మి తలుపుతడుతుందంటున్నారు జ్యోతిష్యులు.
  • ఇంటి ముందు భాగంలో జంట సింహాలు, ఎద్దుల బొమ్మలు ఉంటే చాలా మంచిదట. ఇంటి మెయిన్ ఎంట్రెన్స్​కి ఇరు వైపులా రెండు ఎద్దు బొమ్మలు ఏర్పాటు చేసుకుంటే భోగభాగ్యాలు, సిరిసంపదలు కలుగుతాయని చెబుతున్నారు. లేదా సింహాల బొమ్మలు గుమ్మానికి రెండు వైపులా ఉంటే రాజ వైభోగం సిద్ధిస్తుందంటున్నారు.
  • అదేవిధంగా రామ టెంకాయ(లఘు కొబ్బరికాయ) ఇంట్లో ఉన్నా శుభ ఫలితాలు కలుగుతాయంటున్నారు. ఇవి కుంకుడు కాయ నుంచి ఉసిరికాయ పరిమాణంలో మార్కెట్లో లభిస్తుంటాయి. పూజా మందిరంలో ఒక చిన్న బౌల్​లో సింధూరం పోసి అందులో రామ టెంకాయ ఉంచితే చాలా మంచిది. ఇంటికి అదృష్టం కలిసివస్తుందంటున్నారు.
  • ఇంటికి అదృష్టం కలిసిరావాలంటే మనం ఆహారం స్వీకరించే ప్లేట్​ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఈ ప్లేట్​ని వెండితో తయారు చేయించుకొని దాని మధ్యలో "క్లీం", నాలుగువైపులా "శ్రీం" అనే అక్షరాలు చెక్కించుకోవాలి. అప్పుడు అది అక్షయ పాత్రగా మారుతుంది. రోజూ దానికి మూడు సార్లు నమస్కారం చేసి అందులో భోజనం చేయడం ద్వారా కూడా అదృష్టం కలిసి వస్తుందంటున్నారు జ్యోతిష్య నిపుణులు కిరణ్ కుమార్. కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయంటున్నారు.
  • మీరు నడిపే వాహనానికి గవ్వలు, జీడి గింజలు కలిపి కట్టినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయట. ఇందుకోసం ఒక రాగి తీగ తీసుకొని దానికి ఐదు జీడి గింజలు, ఆరు గవ్వలను ఒకదాని తర్వాత మరొకటి గుచ్చి దాన్ని బండికి కట్టాలి. ఇలా చేయడం ద్వారా కూడా ఇంటికి అదృష్టయోగం కలిసి రావడంతో పాటు మీ వాహన ప్రయాణాలూ సురక్షితంగా సాగుతాయని చెబుతున్నారు.
  • ఇవేకాకుండా అభయ హస్తాన్ని ఇంట్లో ఉంచుకున్నా మంచి ఫలితాలు పొందవచ్చంటున్నారు. ఆశీర్వదిస్తున్నట్లు ఉన్న ఒక చేతి బొమ్మను ఇంట్లో ఉంచితే యజమానికి అదృష్టయోగం, ఐశ్వర్యం సిద్ధిస్తుందంటున్నారు జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్.

Note : పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు, జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఇవీ చదవండి :

కొత్త సంవత్సరంలో ఏలినాటి శని? ఈ పరిహారాలు పాటిస్తే సర్వ దోషాలు పోవడం ఖాయం!

"నిద్ర లేవగానే ఇలా చేస్తే అదృష్టం - మీ దశ మొత్తం తిరుగుతుంది!"

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.