ETV Bharat / spiritual

"న్యూ ఇయర్​ రోజున ఈ మంత్రాలు చదివితే - ఏడాదంతా అదృష్టం, ఐశ్వర్యం మీ వెంటే"! - NEW YEAR MANTRAS IN TELUGU

-కొత్త ఏడాది మొదటి రోజున చదువుకోవాల్సిన మంత్రాలు -జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్​ కుమార్​ వివరణ!

Powerful Mantra to Start New Year
Powerful Mantra to Start New Year (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 30, 2024, 5:20 PM IST

Powerful Mantra to Start New Year: కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే, చాలా మంది జనవరి 1వ తేదీన దగ్గర్లో ఉన్న ఆలయానికి వెళ్లి సంవత్సరమంతా శుభం జరగాలని కోరుకుంటారు. అలాగే ఇంట్లోనూ పూజలు చేస్తుంటారు. అయితే, న్యూ ఇయర్​ రోజున కొన్ని మంత్రాలు జపించడం వల్ల కొత్త సంవత్సరం మొత్తం అదృష్టం, ఐశ్వర్యం సిద్ధింపజేసుకోవచ్చని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్​ కుమార్​ చెబుతున్నారు. ఆ మంత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

గణపతి మంత్రాలు : న్యూ ఇయర్​ రోజున గణపతికి సంబంధించిన మంత్రాలు పఠించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుందని మాచిరాజు చెబుతున్నారు. 'గం క్షిప్ర ప్రసాదనాయ నమః' అనే శక్తివంతమైన మంత్రం పఠించాలని.. దీనినే 'క్షిప్ర గణపతి మంత్రం' అని అంటారని అంటున్నారు. ఈ మంత్రం మనసులో జపించడం వల్ల కోరికలు తొందరగా నెరవేరతాయని.. ఈ మంత్రాన్ని వీలైతే 108 లేదా 54 లేదా 21 సార్లు మనసులో జపించాలంటున్నారు. అలాగే జనాకర్షణ కోసం 'గాం గీం గూం గైం గౌం గః' అనే మంత్రం పఠించాలని.. దీనిని 'గణేశ మాతృక న్యాస మంత్రం' అని అంటారని చెబుతున్నారు.

విష్ణుమూర్తికి సంబంధించిన మంత్రాలు : విష్ణుమూర్తి అనుగ్రహం కోసం కొత్త సంవత్సరం రోజున 'ఓం నమో నారాయణాయ" అనే అష్టాక్షరీ మంత్రం లేదా 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే ద్వాదశాక్షరీ మంత్రాన్ని జపించమని సలహా ఇస్తున్నారు. వీటిలో ఏది చదివినా విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయని చెబుతున్నారు.

ఈ స్తోత్రం చదువుకోండి : కొత్త సంవత్సరం మొదటి రోజున గణపతి అనుగ్రహం కోసం శక్తివంతమైన 'సంకట నాసిక గణేశ స్తోత్రం' చదువుకోమంటున్నారు. అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం కోసం 'విష్ణు సహస్రనామం' చదువుకోవాలని సూచిస్తున్నారు. అలాగే విష్ణు పంజర స్తోత్రం కూడా ఉంటుందని.. దానిని పఠించడం వల్ల శత్రు బాధలు, దృష్టి దోషాలు, ఎదుటి వాళ్ల ఎడుపులు అన్నీ తొలగిపోతాయని అంటున్నారు.

ఇక సంఖ్యా శాస్త్రం ప్రకారం.. జనవరి 1, 2025 అంటే 0+1+0+1+2+0+2+5=11, 1+1=2. దీనిని 'డెస్టినీ నెంబర్​' అంటారు. రెండవ సంఖ్య చంద్రుడిని సూచిస్తుందని.. ఆయనకు అధిష్టాణ దేవత లక్ష్మీదేవి కాబట్టి, జనవరి ఒకటిన లక్ష్మీ పూజ చేసే వారు తెల్లటి పూలతో(మల్లెపూలు, జాజిపూలు, నందివర్ధనం) ఆరాధించాలని మాచిరాజు చెబుతున్నారు. అలాగే లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుందని అంటున్నారు.

Note : పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు, జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

"న్యూ ఇయర్​ రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే - సంవత్సరమంతా విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి"!

జనవరి 1న ఈ ఆలయాలను దర్శిస్తే - 2025 మొత్తం అదృష్టం వరిస్తుందట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.