తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు- ఇష్ట దేవతారాధన శుభకరం! - HOROSCOPE TODAY JANUARY 8TH 2025

2025 జనవరి​ 8వ తేదీ (బుధవారం) రాశిఫలాలు

Horoscope Today January 8th 2025
Horoscope Today January 8th 2025 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 8, 2025, 5:00 AM IST

Horoscope Today January 8th 2025 : 2025 జనవరి​ 8వ తేదీ (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజంతా సుఖ శాంతిమయంగా గడుస్తుంది. రెట్టించిన ఉత్సాహంతో అన్ని పనులూ సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మాతృ వర్గం నుంచి ఆర్థికలబ్ధి ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా వివిధ సమస్యలను ఒకేసారి ఎదుర్కోవలసి వస్తుంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని నిగ్రహం పాటించాలి. దైవబలంతో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారంలో నష్టం రాకుండా జాగ్రత వహించాలి. ఆరోగ్యం క్షీణించే ప్రమాదముంది. సూర్య ఆరాధన శుభకరం.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. క్లిష్టమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. నిర్ణయం తీసుకునే విషయంలో సందిగ్ధత నెలకొంటుంది. ఆచరణ సాధ్యం కాని ఆశల వెంట పరుగులు తీయడం మూర్ఖత్వం అవుతుంది. కోపావేశాలు అదుపులో ఉంచుకోకపోతే చిక్కుల్లో పడతారు. వృథా ఖర్చులు నివారిస్తే మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కుటుంబంలోని చిన్నవారిపై అధిక శ్రద్ధ పెడతారు. కుటుంబంలో విందులు, వేడుకలు జరిగే అవకాశముంది. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించాలి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం శుభకరం.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. నిర్దేశించుకున్న లక్ష్యం దిశగా పయనిస్తారు. ధార్మిక కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉంటారు. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్లే అవకాశముంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. విదేశాల్లో నివసించే బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఈశ్వరుని ఆలయ సందర్శనతో ప్రశాంతత కలుగుతుంది.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా మీ మాటకు తిరుగుండదు. అధికార పరిధి పెరుగుతుంది. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. సౌందర్య సాధనాల కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు. ఆదాయాన్ని మించిన ఖర్చులుండవచ్చు. ఇష్ట దేవతారాధన శుభకరం.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగడం వల్ల పూర్తి ఆనందంగా ఉంటారు. స్నేహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. వివిధ సంస్కృతీ సంప్రదాయాలకు చెందిన వ్యక్తులతో పరిచయం మీ జీవితాన్నే మార్చి వేస్తుంది. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. శివారాధన శ్రేయస్కరం.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. గతం తాలూకు చెడు ప్రభావం తొలగిపోయింది. రానున్నవి అన్నీ మంచి రోజులే! ఆర్థికంగా, వృత్తి పరంగా ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఇంటా బయటా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన విషయాలకే ఖర్చు చేస్తారు. సహోద్యోగుల నుంచి, పై అధికారుల సాయం అందుకుంటారు. ఓ శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ఊహించని ఈ అపజయాలకు కృంగిపోవద్దు. కుటుంబంలో కలహాలు రాకుండా జాగ్రత్త వహించండి. సంతానం గురించి విచారంతో ఉంటారు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. వృథా ఖర్చులు తగ్గించుకోవాలి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కల్లోలంగా ఉన్నకుటుంబ వాతావరణంతో మానసికంగా కృంగిపోతారు. ప్రతికూల ఆలోచనల ప్రభావంతో ఆరోగ్యం క్షీణిస్తుంది. ఏ పని చేయడానికి శక్తీ, ఉత్సాహం కోల్పోయిన అనుభూతి వెన్నాడుతుంది. ప్రియమైన వారితో అనవసరంగా గొడవ పడతారు. శత్రు భయం పెరుగుతుంది. అవమానకరమైన పరిస్థితులకు దూరంగా ఉంటే మంచిది. సహోద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మొండితనం, నిర్లక్ష్య వైఖరీ కారణంగా ఈ రోజు చాలా నష్టపోతారు. శనిస్తోత్రం పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల నుంచి గట్టెక్కుతారు. అనుకున్నట్లుగా పనులు సాగడం వల్ల సంతోషంతో ఉప్పొంగిపోతారు. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అదృష్టం వరించి సంపదలు వృద్ధి చెందుతాయి. సొంత ఇంటి కల నెరవేరే రోజులు దగ్గరలో ఉన్నాయి. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు ప్రణాళికలు వేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మీ మాటతీరు, మొండి వైఖరి కారణంగా శత్రువులు పెరిగే ప్రమాదముంది. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక సంబంధమైన విషయాలలో తగు జాగ్రత్త వహించండి. అవాంఛనీయమైన సంఘటనలు చెలరేగి మీకూ, మీ బంధువులకూ మధ్య అభిప్రాయ భేదాలు నెలకొనే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత కొరవడుతుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆర్ధిక సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో ప్రతికూలతలు తొలగిపోతాయి.

ABOUT THE AUTHOR

...view details