ETV Bharat / spiritual

ఐశ్వర్య ప్రాప్తి కలిగించే దేవతా వృక్షాలు! ఆ చెట్లు ఏంటో మీకు తెలుసా? - DEVATA VRUKSHALU

లక్ష్మీ దేవిని స్వరూపంగా భావించే దేవతా వృక్షాల గురించి మీకోసం!

Divine Trees
Divine Trees (Getty Image)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 24, 2025, 6:48 AM IST

Devata Vrukshalu : హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం కొన్ని చెట్లలో దేవుళ్లు ఉంటారని విశ్వాసం. చెట్లను దైవంగా భావించి పూజించడం మన సంప్రదాయం. ప్రకృతిలో పరమాత్మను చూసి పూజించే గొప్ప సంప్రదాయం హిందూ మతానికి ఉంది. ఈ క్రమంలో కొన్ని చెట్లను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజించడం కూడా చూస్తుంటాం. నిజానికి కొన్ని వృక్షాలకు దేవతా వృక్షాలని కూడా పేరుంది. ఈ సందర్భంగా చెట్లకు ఈ దైవత్వం ఎలా వచ్చింది? ఏయే చెట్లను పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

దేవతా వృక్షాలు
తులసి, రావిచెట్టు, శమీవృక్షం, అశోక వృక్షం, మర్రి చెట్టు, ఉసిరి చెట్టు, దేవదారు వృక్షం, పారిజాత వృక్షం, సంతాన వృక్షం, కల్పవృక్షంలను దేవతా వృక్షాలని అంటారు. అయితే వీటిలో కొన్ని స్వర్గంలోని ఉంటాయని అంటారు.

ఈ చెట్లు కూడా దేవతా వృక్షాలే
లక్ష్మీదేవి కొబ్బరి, అరటి, మామిడి, తులసి, మారేడు చెట్లలో నివశిస్తుందని అంటారు. ఈ చెట్లకు ఇంతటి విశిష్టత ఎలా వచ్చిందో చూద్దాం.

కొబ్బరి చెట్టు
కొబ్బరి చెట్టుకు ఉండే ప్రత్యేక పోషణలు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ చెట్టు ఎటువంటి వాతావరణంలో అయినా పెరుగుతుంది. అలాగే కొబ్బరి చెట్టులోని ప్రతి వస్తువు మానవాళికి ఉపయోగపడేదే.

అరటి చెట్టు
అరటి చెట్టు కూడా ఎంతో ఉపయుక్తమైనది. అరటి ఆకులో భోజనాలు, అరటిపళ్లు, అరటికాయ, అరటిపువ్వు ఇలా అరటిచెట్టులో ప్రతి భాగం ఉపయోగపడుతుంది. ఇంట్లో ఎటువంటి దైవ శుభా కార్యాలలో అయినా అరటిపండు లేకుండా ఉండదు.

మామిడి చెట్టు
వసంతంలో వచ్చే మామిడి పూత లక్ష్మీ పుత్రుడు అయిన మన్మథుడికి ఎంతో ప్రీతికరమైనది. మామిడి ఆకులతో ఇంటి గుమ్మాలకు తోరణాలు కడతాము. మామిడి పండ్ల రసంతో పరమశివునికి అభిషేకం చేస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. వేసవిలో మామిడి పండ్లు దానం చేస్తే చక్రవర్తి అవుతారని పురాణాలు చెబుతున్నాయి.

తులసి మొక్క విశిష్టత
తులసి మొక్క లేని ఇల్లంటూ ఉండదు. అలాగే తులసీ దళాలు లేకుండా విష్ణుమూర్తికి చేసే పూజ సంపూర్ణం అనిపించుకోదు. తులసి దళాలతో ప్రసాదానికి పవిత్రత చేకూరుతుంది. మరణం ఆసన్నమైన సమయంలో నోటిలో తులసి తీర్ధం పోయడం హిందూ సంప్రదాయం.

తులసితో పవిత్రత
నారద పురాణం ప్రకారం తులసిని తాకినంతనే పవిత్రత సిద్ధిస్తుంది. తులసిని ప్రార్ధించడం వల్ల రోగాలు నశిస్తాయి. తులసిని పూజించిన యముని గూరించి భయముండదు. స్కంద పురాణం ప్రకారం తులసి విష్ణువునకు ప్రియమైన భక్తురాలు. తులసి పూజ చేస్తే మాంగల్యం చిరకాలం నిలుస్తుంది. తులసి ఉన్నచోట దుష్ట శక్తులు ప్రవేశించవు. ఉదయాన్నే తులసిని దర్శించుకుంటే పాపాలు నశిస్తాయి. తులసి ఆకులు, పూలు శ్రీకృష్ణునకు అత్యంత ప్రీతికరమైనవి. భారతీయ సంస్కృతిలో తులసికి పవిత్ర స్థానం, ప్రధాన స్థానం ఉంది. తులసిని ప్రత్యక్ష దైవంగా పూజిస్తారు. అకాల మరణం కలగకుండా తులసి చెట్టు కాపాడుతుందని విశ్వాసం.

మారేడు చెట్టు
శివుని పూజకు మారేడు దళాలు శ్రేష్టం. మారేడు దళాలలో శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుంది. మారేడు పండులోని గుజ్జంతా తీసేసి ఎండబెట్టి, అందులో విభూతి ఉంచుకొని ప్రతిరోజూ విభూతి ధారణ చేస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని శాస్త్రవచనం.

శాస్త్రీయ కోణం
శాస్త్రీయ పరంగా చూస్తే మనం దేవతా వృక్షాలని భావించే ప్రతి చెట్టు ఎక్కువగా ఆక్సిజన్ విడుదల చేస్తుంది. మానవాళికి ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగపడే చెట్లను దేవతా వృక్షాలుగా భావించి పూజించే క్రమంలో ప్రకృతిని కాపాడటం అనే పరమధర్మం ఇమిడివుంది. చెట్లను ఎక్కువగా పెంచడం వల్ల పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం తెలియజేస్తుంది. మాములుగా చెబితే పాటించరని దేవతా వృక్షాలని చెబితే చెట్లను నాశనం చేయకుండా ప్రకృతిని రక్షిస్తారన్న విశ్వాసంతో మన పెద్దలు ఈ నియమాలు పెట్టి ఉండవచ్చు.

ఏది ఏమైనా ప్రకృతి లేకుంటే మానవ మనుగడే లేదు. వృక్షాలను దైవంగా పూజిద్దాం. ప్రకృతిని కాపాడుకుందాం. ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు! లోకా సమస్తా సుఖినో భవంతు!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.