Gold Rate Today January 24th 2025 : దేశంలో బంగారం ధర పెరగగా, వెండి రేట్లు తగ్గాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.82,700 ఉండగా, శుక్రవారం రూ.180 పెరిగి రూ.82,880గా ఉంది. గురువారం కిలో వెండి ధర రూ.93,920 ఉండగా, శుక్రవారం నాటికి రూ.292 తగ్గి రూ.93,628కు చేరుకుంది.
- Gold Price In Hyderabad January 24th 2025 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.82,700గా ఉంది. కిలో వెండి ధర రూ.93,920గా ఉంది.
- Gold Price In Vijayawada January 24th 2025 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.82,700గా ఉంది. కిలో వెండి ధర రూ.93,920గా ఉంది.
- Gold Price In Visakhapatnam January 24th 2025 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.82,700గా ఉంది. కిలో వెండి ధర రూ.93,920గా ఉంది.
- Gold Price In Proddatur January 24th 2025 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.82,700గా ఉంది. కిలో వెండి ధర రూ.93,920గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price January 24th 2025 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగాయి. గురువారం ఔన్స్ గోల్డ్ ధర 2,748 డాలర్లుగా ఉండగా, శుక్రవారం నాటికి 24 డాలర్లు పెరిగి 2,772 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 30.77 డాలర్లుగా ఉంది.
స్టాక్ మార్కెట్ అప్డేట్స్
Stock Market Today January 24th 2025 : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా ట్రేడింగ్ మొదలుపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో సూచీలు రాణిస్తున్నాయి. బీఎస్ఈ ఇండెక్స్‌లో ప్రధాన కంపెనీలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ షేర్లలో కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. దీంతో ఇవి లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 231 పాయింట్ల లాభంతో 76,655 వద్ద కొనసాగుతోంది, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 39 పాయింట్లు పెరిగి 23,245 వద్ద ట్రేడ్ అవుతోంది.
లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ :
(బీఎస్ఈ సూచీ సెన్సెక్స్) పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్
నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : (బీఎస్ఈ సూచీ సెన్సెక్స్) సన్‌ఫార్మా, జొమాటో, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, మారుతీ సుజుకీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్
రూపాయి విలువ
Rupee Value January 24th, 2025 : ప్రస్తుతం రూపాయి మారకం విలువ యూఎస్ డాలర్‌తో పోలిస్తే రూ.86.28 గా ఉంది
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol And Diesel Prices January 24th 2025 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.45గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
ముడిచమురు ధరలు
Crude Oil Prices January 24th, 2025 : అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 78.19 డాలర్లుగా ఉంది.