ETV Bharat / spiritual

సొంత ఇంటి కల నిజం చేసే 'మణిద్వీప వర్ణన' - 9సార్లు ఇలా చేస్తే కోరిన కోర్కెలు తీరడం ఖాయం! - MANIDWEEPA VARNANA TELUGU

సొంత ఇల్లు కల సాకారం చేసే మణిద్వీప వర్ణన - మణిద్వీప వర్ణన మహత్యం ఇదే!

Manidweepa Varnana Telugu
Manidweepa Varnana Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 24, 2025, 7:39 AM IST

Manidweepa Varnana Telugu : సొంత ఇల్లు ఇతర ఐహిక సుఖాల కోసం ఈ బ్రహ్మాండమును కనురెప్పపాటులో సృష్టించి లయం చేయగల ముప్పై రెండు మహాశక్తుల పరిరక్షణలో ఈ సమస్త విశ్వమూ ఉందట. అందుకే ముప్పై రెండురకాల పూలతో, పసుపు కుంకుమలతో, నవరత్నాలతో, రాగి కంచు వెండి బంగారము మెదలగు లోహాలతో యథాశక్తి పూజ చేసుకుంటూ 32 రకాల నైవేద్యాలు చేసి, సుగంధ ద్రవ్యాలతో మణిద్వీప నివాసినిని పూజించడం సంప్రదాయం.

32 రకాల నైవేద్యాలు
32 రకాల నైవేద్యాలు చేయడానికి శక్తిలేని వారు తమ తమ శక్తి కొద్దీ నైవేద్యాలను సమర్పించుకొని పూజించుకోవచ్చు. పరాశక్తి పూజలో భక్తి ప్రధానము. అయితే కలకండ మొదలుకొని, ఏలకులు, రకరకాల పండ్లు, కొబ్బరికాయలు కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు.

32 రకాల పూలు
మొగలి పువ్వు, బంతి పువ్వు పూజకు పనికిరాదు. మందారాలలో గులాబీలలో చామంతులలో చాలా రకాలు ఉన్నా వాటన్నిటినీ ఒక్కొక్కటిగానే పరిగణించి పూజలో ఉపయోగించాలి.

1. మల్లెపువ్వులు

2. గులాబి

3. సన్నజాజి

4. విరజాజి

5.సెంటుమల్లి

6. డిసెంబర్ పువ్వులు

7. చామంతులు

8. లిల్లీ

9. ముద్ద గన్నేరు పువ్వులు

10. నందివర్ధనం

11. పారిజాత పూలు

12. చంద్రకాంత పూలు

13. సువర్ణ గన్నేరు పూలు

14. కలువ పూలు

15. పాటలీ పుష్పాలు

16. ముద్ద నందివర్ధనం

17. గన్నేరు పూలు

18. కదంబ పూలు

19. మందారాలు

20. తామరలు

21. కనకాంబరాలు

22. దేవ గన్నేరు పూలు

23. అశోక పుష్పాలు

24. నిత్య మల్లెపువ్వు

25. కుంకుమపువ్వు

26. పొన్నపువ్వు

27. మంకెనపువ్వు

28. పున్నాగ పుష్పాలు

29. కాడమల్లె

30. నాగమల్లి

31. చంపక ( సంపంగి)

32. నూరు వరహాలు

మణిద్వీప వర్ణన మహత్యం
దేవి భాగవతం ప్రకారం శ్రీ చక్ర బిందు రూపిణి శ్రీ లలితా మహా త్రిపుర సుందరి అమ్మవారు నివాసముండే పవిత్ర ప్రదేశమే మణి ద్వీపం. పదునాలుగు లోకాలకు పైన ఉండే సర్వలోకంలో ఆమె కొలువై ఉంటారు. ఈ జగత్తు మొత్తాన్ని పరిరక్షించే అమ్మవారి మనసులో ఏర్పడిన ఆలోచనలకు అనుగుణంగా ఈ లోకం ఉద్భవించింది.

నలువైపులా అమృత సముద్రాలు
నాలుగువైపులా అమృతంతో కూడిన సముద్రం సరిహద్దులుగా వున్న ఈ మణి ద్వీపాన్ని వర్ణించాలంటే మన శక్తి చాలదు. మహిమాన్వితమైన అమ్మవారు మణిద్వీపంలో చింతామణి గృహంలో పరివేష్టితమై ఉంటారు. దేవీ భాగవతంలో మణి ద్వీపం గురించి వర్ణన ఉంది. అంతులేని వజ్రాలు, రత్నాలు, ముత్యాలు లాంటి నవ నిధులతో పాటు బంగారు మయమైన కొండలు ఈ ద్వీపంలో ఉన్నాయి.

లోహ ప్రాకారాలు
అనేక ప్రాకారాల అనంతరం అమ్మవారు తన భక్తులకు దర్శనమిస్తారు. మొదట వచ్చే ఇనుప ప్రాకారంలో భూమండలంలోని రారాజులు ఉంటారు. వీరు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను పంపుతుంటారు. అనంతరం కంచుతో చేసిన రెండో ప్రాకారం ఉంటుంది. పచ్చటి అరణ్యములతో, వివిధ రకాల జంతువులు, పక్షుల కిలకిలరావాలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనిస్తుంటుంది. ఇలా అనేక ప్రాకారాలు దాటిన అనంతరం చింతామణి గృహంలో అమ్మవారు ఉంటారు. జ్ఞాన మండపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ముక్తి మండపంలో మంత్రులతో చర్చలు నిర్వహిస్తారు. వైకుంఠం, కైలాసం కంటే అద్భుతమైన ప్రపంచం అమ్మవారి నివాసం. యావత్‌ విశ్వంలో ఎక్కడా లభించని అనంతమైన సంపద అక్కడ వుంటుంది. అన్నింటినీ మించి అమ్మ సన్నిధిలో ఉండటమే గొప్ప వరం.

వాస్తు దోషాలు తొలగించే మణిద్వీప పారాయణ
ఒక్కసారి మణిద్వీప వర్ణన మనసు పెట్టి పారాయణ చేస్తే కళ్లకు కట్టినట్లుగా మణిద్వీపం కనబడుతుంది. నిజంగా మనమే మణిద్వీపంలో అమ్మవారిని దర్శిస్తున్న అనుభూతి కలుగుతుంది. అందుకనే మణిద్వీప వర్ణన పారాయణం చేస్తుంటారు. ఈ పారాయణతో ఇంట్లోని వాస్తుదోషాలు తొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఐశ్వర్యాలూ లభిస్తాయి.

సొంత ఇంటి కల సాకారం
సొంత ఇల్లు కట్టుకోవాలని కోరుకునే వారు 9 సార్లు మణిద్వీప వర్ణన పారాయణ చేస్తే తప్పకుండా సొంత ఇల్లు కట్టుకుంటారు. అలా సొంత ఇల్లు కట్టుకున్న వారు నూతన గృహప్రవేశ శుభ సందర్భాలలో తరతరాలుగా మణిద్వీప వర్ణన పారాయణ చేయడం ఓ ఆచారంగా వస్తోంది.

అంతేకాదు మణిద్వీప వర్ణన, చింతామణి గృహవర్ణనలు వింటేనే సకల పాపాలూ నశిస్తాయని భక్తకోటి నమ్మకం.

ఓం శ్రీమాత్రే నమః

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.