Crocodile Enters Mahabababad Temple : ఉదయం గుడికి వెళ్లి దేవుణ్ని దర్శించుకుందాం అనుకున్న భక్తులకు గుండె బద్దలైనంత పనైంది. ఎంచక్కా దేవుడికి దండం పెట్టుకోవాలి అనుకున్న వారికి ఒక్కసారిగా మొసలి దర్శనమివ్వడంతో కంగుతిన్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కొల్లాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామస్థులు తెలిపిన వినరాల ప్రకారం కొల్లాపూర్ గ్రామ శివారులోని గంగమ్మ గుడి ఆవరణలోకి గురువారం ఓ మొసలి ప్రవేశించింది. దేవుని దర్శనం కోసం వచ్చిన వారు ఎదురుగా మొసలిని చూసి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. మొసలి ఆలయం నుంచి బయటకు రాకుండా రాళ్లు అడ్డంగా పెట్టారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న అటవీ సిబ్బంది, మొసలిని పట్టుకుని పాకాల సరస్సులో వదిలేశారు. దీంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.
పెరటి చెట్టు పొదల్లో కదలిక - ఏంటా అని వెళ్లి చూసిన మహిళ గుండె ఆగినంత పనైంది!