Horoscope Today January 24th 2025 : 2025 జనవరి 24వ తేదీ (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతాయి. ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోయి సంపద వృద్ధి చెందుతుంది. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. విష్ణుమూర్తి ధ్యానం శుభప్రదం.
వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళికలు పకడ్బందీగా వేస్తారు. ఆర్ధికంగా ఎదగడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు మంచి లాభాలనిస్తాయి. వృధా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. హనుమ ఆలయ సందర్శనం శుభప్రదం.
మిథునం (Gemini) : మిథున రాశి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగంలో పనిభారం పెరిగే సూచన ఉంది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది. కొత్త పనులు, ప్రాజెక్టులు వాయిదా వేస్తే మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో బుద్ధిబలంతో వ్యవహరిస్తూ చురుగ్గా ఉంటే సత్ఫలితాలు ఉంటాయి. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. ఒక వ్యవహారంలో ఆటంకాలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు. శత్రువుల నుంచి ఆపద పొంచి ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. శివారాధన శ్రేయస్కరం.
సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించబోయే పనుల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో వాదప్రతివాదాలు పెరుగుతాయి. ముఖ్యమైన విషయాల్లో ఏకాగ్రత అవసరం. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఆస్తి విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. కార్యసిద్ధి హనుమ ఆరాధన మేలు చేస్తుంది.
కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్ధిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల ఇంట్లో శుభకార్యాలలో పాల్గొంటారు. అవివాహితులకు కళ్యాణయోగం ఉంది. వాదనలకు దూరంగా ఉండడం, మితభాషణం అవసరం. ఖర్చులు పెరగకుండా జాగ్రత పడండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. పెద్దల మాటలకు విలువ ఇవ్వాలి. కోపావేశాలు అదుపులో ఉంచుకోండి. వృత్తి వ్యాపారాలలో ఆందోళనకర పరిస్థితులు ఉండవచ్చు. మనోధైర్యంతో ముందుకు సాగితే విజయం సిద్ధిస్తుంది. మీ మొండి వైఖరి మీతో బాటు మిగతా వారినీ కష్టాల పాలు చేస్తుంది. ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్య సంబంధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.
వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బద్దకాన్ని వీడి శ్రమిస్తే వృత్తిపరమైన లాభాలు ఉంటాయి. కీలక విషయాలలో మనో ధైర్యంతో వ్యవహరిస్తే విజయం తధ్యం. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సన్నిహితుల నుంచి బహుమతులు అందుకుంటారు. ప్రయాణాలు అనుకూలం. ఓ శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.
ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. భావోద్వేగాలను నియంత్రణలో పెట్టుకోలేని మీ అశక్తత కారణంగా సమస్యల్లో చిక్కుకుంటారు. మాటతీరును మార్చుకుంటే మంచిది. అవమానకర పరిస్థితులకు దూరంగా ఉండండి. ఆర్ధిక సమస్యల కారణంగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. జీవిత భాగస్వామితో కలహాలు చికాకు పెడతాయి. నవగ్రహ శ్లోకాలు పఠించడం మేలు చేస్తుంది.
మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉంటాయి. సమావేశాలలో మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకర్షిస్తారు. ఇంటా బయటా సానుకూల ఫలితాలు ఉంటాయి. సంతానం పురోగతి ఆనందం కలిగిస్తుంది. ఆర్ధిక క్రమశిక్షణతో ఆస్తులు వృద్ధి చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది.ఇష్ట దేవతారాధన శుభకరం.
కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగడంతో ఉత్సాహంగా ఉంటారు. ఇంట్లో శాంతియుతమైన వాతావరణం ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. అన్ని రంగాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. శ్రీలక్ష్మీ ధ్యానం శుభకరం.
మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే అన్నింటా జయం ఉంటుంది. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు తెలివిగా పరిష్కరిస్తారు. ఆదాయంలో పెరుగుదల ఉండవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గణపతి ఆరాధన శుభకరం.