Horoscope Today December 24rd 2024 : డిసెంబర్ 24వ తేదీ (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ పరోపకార గుణాన్ని విమర్శించే వారి గురించి పట్టించుకోవద్దు. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా కొంతకాలంగా ఉన్న గడ్డు పరిస్థితులు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో అనుబంధం దృఢ పడుతుంది. తీర్ధ యాత్రలకు, విహార యాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.
వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉన్నతమైన వ్యక్తిత్వంతో, వాక్చాతుర్యంతో అందరినీ మెప్పిస్తారు. ముఖ్యమైన సదస్సులు, సమావేశాలకు అనుకూలమైన రోజు. వృత్తి వ్యాపారాలలో అద్భుతంగా రాణిస్తారు. ఫలితాలు రావడం ఆలస్యమయినా కోరుకున్న ఫలితాలను పొందుతారు. తొందరపాటు నిర్ణయాలు తగదు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొద్దిరోజులుగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య పరిష్కారం అవుతుంది. అవసరానికి సన్నిహితుల సహాయం అందుతుంది. మనోబలంతో ముందుకు సాగితే కార్యసిద్ధి ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది. వృత్తి రీత్యా చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఖర్చులు పెరగవచ్చు. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.
కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాలలో కొత్త ప్రాజెక్టులు, వెంచర్లు మొదలు పెడతారు. చేపట్టిన అన్ని పనులు ఫలవంతం కావడం వల్ల సంతోషంగా ఉంటారు. అనుకోని ఆర్ధిక లాభాలు అందుకోవడం వల్ల మీ ఆనందం రెట్టింపు అవుతుంది. పోటీదారులపై విజయం సాధిస్తారు. సామాజికంగా పరపతి పెరుగుతుంది. శివారాధన శ్రేయస్కరం.
సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దృఢమైన మనసుతో ముందుకు సాగితే సత్ఫలితాలు ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఆచి తూచి వ్యవహరిస్తే మంచిది. వృత్తి ఉద్యోగాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కష్ట సమయంలో సన్నిహితుల సహకారం ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. వృధా ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.
కన్య (Virgo) :కన్యరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మిత్రుల సహకారంతో క్లిష్టమైన సమస్యను పరిష్కరిస్తారు. పని ప్రదేశంలో ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబంలో అపార్ధాలకు, వివాదాలకు అవకాశం ఉంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కీర్తి పెరుగుతుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.
తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభ సమయం నడుస్తోంది. బంధు మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. ఆర్ధిక అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. కోపావేశాలను అదుపులో ఉంచుకొని మాట్లాడితే కలహాలు రావు. మీ మనోధైర్యమే మిమ్మల్ని కాపాడుతుంది. ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన శుభకరం.
వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బుద్ధి బలంతో చేసే పనులు సత్వర ప్రయోజనాలను ఇస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. ఆదాయం ఆశించిన మేరకు ఉంటుంది. కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.
ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అదృష్టం వరించి ఐశ్వర్యవంతులవుతారు. అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు, స్దాన చలనం ఉండవచ్చు. వ్యాపార పరంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలు అనుకూలం. పిత్రార్జితం కలిసి వస్తుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.
మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బుద్ధి బలంతో, సమయస్ఫూర్తితో వ్యవహరిసే పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. రచయితలకు, కళాకారులకు అనుకూలమైన సమయం. సృజనాత్మకతతో చేసే కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వృధా ఖర్చులు నివారించండి. నవగ్రహ ఆరాధన మేలు చేస్తుంది.
కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి పరంగా ఇబ్బందులు, ఒత్తిడి ఉండవచ్చు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ఓ శుభవార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. దైవారాధన మానవద్దు. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటే మంచిది. ఇతరులు భాధపడే పనులు చేయవద్దు. ఇంట్లో శుభకార్యం మూలకంగా ధనవ్యయం ఉండవచ్చు. శ్రీరామనామ జపం శక్తినిస్తుంది.
మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ధైర్యంగా ముందడుగు వేస్తే విజయం మీదే! నైపుణ్యాలు మెరుగు పరచుకుంటే ప్రత్యర్థులతో పోటీలో గెలవచ్చు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన సమస్య పరిష్కరిస్తారు. మనశ్శాంతి, మంచి ఆరోగ్యం ఉంటాయి. అవసరానికి ధనం సమకూరుతుంది. ఆర్ధిక లాభాలు మెండుగా ఉన్నాయి. ఇష్ట దేవతారాధన శుభప్రదం.