IND W vs WI W 2nd ODI : వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ఇండియా మహిళలు వరుసగా రెండో విజయం నమోదు చేశారు. మంగళవారం జరిగిన రెండో వన్డేలో భారత్ ఏకంకా 115 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 358-5 స్కోర్ నమోదు చేసింది. ఇక భారీ లక్ష్య ఛేదనలో విండీస్ కూడా పోరాడింది. 46.2 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ హేలీ మ్యాథ్యూస్ (106 పరుగులు) సెంచరీతో రాణించినా, మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. టీమ్ఇండియాలో ప్రియా మిశ్ర 3, దీప్తి శర్మ, టిటాస్ సాధు, ప్రతికా తలో 2, రేణుకా సింగ్ 1 వికెట్ దక్కించుకున్నారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 358-5 పరుగులు చేసింది. యంగ్ బ్యాటర్ హర్లీన్ డియోల్ (115 పరుగులు, 103 బంతుల్లో 16 ఫోర్లు) సూపర్ సెంచరీ సాధించింది. మూడో స్థానంలో వచ్చిన హర్లీన్ బౌలర్లపై విరుచుకుపడింది. ఎడాపెడా బౌండరీలు బాదేసి విండీస్ బౌలర్లను బెంబేలెత్తించింది. ఓపెనర్లు స్మృతి మంధాన (53 పరుగులు: 47 బంతుల్లో, 7x4, 2x6), ప్రతీకా రావల్ (76 పరుగులు; 86 బంతుల్లో 10x4, 1x6 సిక్స్), జెమీమా రోడ్రిగ్స్ (52 పరుగులు ; 36 బంతుల్లో 6x4, 2x6) ముగ్గురు హాఫ్ సెంచరీలతో రాణించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (22 పరుగులు) పరుగులు చేసింది. దీంతో భారత్ భారీ స్కోర్ సాధించింది. అయితే వన్డేల్లో భారత్ 350కిపైగా స్కోరు చేయడం ఇది రెండోసారి. 2022లో ఐర్లాండ్‌పై కూడా సరిగ్గా 358-5 స్కోరు చేసింది.
For a determined and impressive 💯, Harleen Deol is the Player of the Match 🏆
— BCCI Women (@BCCIWomen) December 24, 2024
Scorecard ▶️ https://t.co/u2CL80qolK#TeamIndia | #INDvWI | @IDFCFIRSTBank | @imharleenDeol pic.twitter.com/3ohTRQDB6U
ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2- 0తో దక్కించుకుంది. తొలి మ్యాచ్‌లో భారత్ 211 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. కాగా, డిసెంబర్ 27న ఇరుజట్ల మధ్య వడొదర వేదికగా మూడో వన్డే జరగనుంది.
𝗧𝗲𝗮𝗺 𝗘𝗳𝗳𝗼𝗿𝘁! 🤝#TeamIndia registered their joint-highest score in ODIs (in women's cricket) 🙌 🙌
— BCCI Women (@BCCIWomen) December 24, 2024
Updates ▶️ https://t.co/u2CL80qolK#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/6DU75sGO2g
మహిళల ఛాంపియన్‌షిప్ - భారత్ పరిస్థితేంటి?
మూడు వన్డేల సిరీస్‌లో భారత్ భారీ విన్ - 211 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై విజయం