16 Years Boy Attacked On Man For Girl In Nirmal : నిండా 16 ఏళ్లు కూడా లేవు కానీ నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ ఓ బాలిక వెంటపడ్డాడు. బాలిక తిరస్కరించడంతో ఆమె తండ్రి వద్దకు వెళ్లి తమకు ఇద్దరికీ పెళ్లి చేయమన్నాడు. ఇద్దరికీ పెళ్లీడు వచ్చాక చూద్దాం అని, అప్పటి వరకు తమ కుమార్తె వెంటపడొద్దంటూ పంపించేశాడు ఆ తండ్రి. దీంతో పగ పెంచుకొని ఆయనపై హత్యాయత్నం చేశాడు. ఈ ఘటనకు సంబంధించి ఆదివారం నిర్మల్ సబ్ డివిజన్ ఏఎస్పీ రాజేశ్ మీనా, పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ వివరాలు వెల్లడించారు.
నిర్మల్‌లో మేస్త్రీగా పని చేసే ఓ బాలుడు (16) ఇటీవల తను ఉండే కాలనీకే చెందిన బాలిక (16) వద్దకు వెళ్లి నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుందామని అడగగా ఆమె అంగీకరించలేదు. దీంతో అతడు బాలిక తండ్రి వద్దకు వెళ్లి అడిగాడు. తనను ప్రేమిస్తున్నానంటూ, తమకు పెళ్లి చేయాలని విషయం చెప్పాడు. పెళ్లీడు వచ్చాక మాట్లాడదామని అబ్బాయికి ఆయన చెప్పారు. ఇలాగైతే తాను ప్రేమించిన అమ్మాయి తనకు దక్కదన్న భావనతో కోపం పెంచుకున్న బాలుడు, బాలిక తండ్రిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు.
పట్టణంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన మహ్మద్ తౌసిఫ్ ఉల్లా (20)తో కలిసి శనివారం అర్ధరాత్రి ఆయన ఇంటికి వెళ్లి దాడి చేసి, కత్తెరతో పొడిచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడటంతో కుటుంబసభ్యులు ఆయన్ను మొదట నిర్మల్ జిల్లా ఆసుపత్రికి, తర్వాత మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు, బాలుడితో పాటు అతడికి సహకరించిన యువకుడిని ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
చుట్టూ జనం ఉన్నారన్న భయమే లేదు - బస్టాప్‌లో తండ్రిని పొడిచి చంపిన కుమారుడు
నుదుట సింధూరం పెట్టి పెళ్లి అయిందన్నాడు - అవసరం తీరాక రూ.20 లక్షలు ఇస్తా అంటున్నాడు