Street Style Veg Fried Rice : చాలా మందికి ఫ్రైడ్ రైస్ అంటే ఎంతో ఇష్టం. ఇంట్లో రాత్రి అన్నం మిగిలిపోయినా.. నిమిషాల్లోనే లంచ్ బాక్స్ రెడీ అయిపోవాలన్నా.. ఎక్కువ మంది ఫ్రైడ్ రైస్ చేసేస్తుంటారు. అయితే.. ఇంట్లో ఎప్పుడూ తాలింపు అన్నం ఒకేలా చేసి పెడితే ఇష్టంగా తినరు. అలా కాకుండా ఒక్కసారి ఈ స్టోరీలో చెప్పిన విధంగా టేస్టీగా "వెజ్ ఫ్రైడ్ రైస్" చేసేయండి. ఇక్కడ చెప్పిన విధంగా ఫ్రైడ్ రైస్ చేస్తే కేవలం 10 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. అలాగే తక్కువ టైమ్‌లో చేసినా టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. ఈ రైస్ లంచ్ బాక్స్‌లోకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మరి, ఆలస్యం చేయకుండా.. సింపుల్‌గా వెజ్ ఫ్రైడ్ రైస్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటీ ? తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- బియ్యం-ఒకటిన్నర గ్లాసు
- క్యారెట్-1
- ఉల్లిపాయ-1
- పచ్చిమిర్చి-2
- నూనె- సరిపడా
- ఉప్పు-రుచికి సరిపడా
- బీన్స్-5
- కారం-టీస్పూన్
- ధనియాల పొడి-టీస్పూన్
- మిరియాలపొడి-అరటీస్పూన్
- సోయా సాస్-టేబుల్‌స్పూన్
- వెనిగర్-టేబుల్‌స్పూన్
- కొత్తిమీర తరుగు
- అల్లం వెల్లుల్లి పేస్ట్-టీస్పూన్
తయారీ విధానం :
- ముందుగా ఒక రెండుసార్లు బియ్యాన్ని కడగండి. ఆపై రైస్ ఉడికించుకోవడం కోసం స్టౌ పై గిన్నె పెట్టండి. ఇందులో 3 గ్లాసుల నీరు, కొద్దిగా నూనె, ఉప్పు వేయండి.
- నీరు బాగా మరుగుతున్నప్పుడు రైస్ వేసి.. అన్నం పొడిపొడిగా వండుకోండి.
- ఇప్పుడు రెసిపీలోకి క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలి.
- ఆపై వెజ్ ఫ్రైడ్ రైస్ చేయడానికి స్టౌపై పాన్ పెట్టండి. ఇందులో 3 టేబుల్స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేయండి. నూనె బాగా వేడయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించండి.
- ఇవి వేగిన తర్వాత స్టౌ హై ఫ్లేమ్‌లో పెట్టి క్యారెట్, బీన్స్ ముక్కలు వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి.
- ఇప్పుడు అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయండి. అనంతరం పొడిపొడిగా ఉడికించుకున్న అన్నం వేసి మిక్స్ చేయండి.
- ఆపై కారం, ధనియాల పొడి, మిరియాలపొడి, ఉప్పు వేసుకుని బాగా కలపండి.
- మసాలాలు రైస్‌కి పట్టిన తర్వాత సోయా సాస్, వెనిగర్ వేసి కలపండి. స్టౌ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లుకుని మిక్స్ చేయండి.
- అంతే ఇలా చేస్తే టేస్టీ వెజ్ ఫ్రైడ్ రైస్ మీ ముందుంటుంది. నచ్చితే ఈ విధంగా ఫ్రైడ్ రైస్ ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేయండి.
లంచ్ బాక్స్ స్పెషల్ కమ్మటి "ఉసిరికాయ అన్నం" - 10 నిమిషాల్లోనే సిద్ధం చేయండిలా!
లంచ్ బాక్స్ స్పెషల్ : హెల్దీ అండే టేస్టీ "పాలక్ పులావ్" - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా!