ETV Bharat / state

బీటెక్‌ తరువాత ఏం చేయాలి చదువా, ఉద్యోగమా అని ఆలోచిస్తున్నారా - ఇదిగో క్లారిటీ!! - AFTER BTECH JOB OR STUDIES

బీటెక్‌ (మెకానికల్‌) చివరి ఏడాది చదువుతున్నారా? - ర్వాత ఎంటెక్‌ చదవాలా? ఉద్యోగం చేస్తే కెరియర్‌ను ఎలా ఎంచుకోవాలి? - విద్యా నిపుణులు ఏం చెప్తున్నారంటే

After Btech Higher Studies or Job Which is Better
After Btech Higher Studies or Job Which is Better (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 13 hours ago

After Btech Higher Studies or Job Which is Better : చాలా మంది విద్యార్థులు బీటెక్‌ పూర్తయిన తర్వాత ఏం చేయాలి అనే ఆలోచనలో ఉంటారు. మాస్టర్స్‌ చేయాలా లేక ఉద్యోగం చేయాలా అన్న ప్రశ్నవారి మొఖంలో కనిపిస్తుంది. అలాంటి వారికి నిపుణులు ఏం చేప్తున్నారంటే.. బీటెక్ చివరి ఏడాది చదువుతున్నారంటే అప్పటికే కెరియర్‌ గురించి ఒక నిర్ణయానికి రావాలి. ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం మొదట్లోనే బీటెక్ తరువాత ఏం చేయాలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆ దిశలో ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. ఎంటెక్‌ చేయాలా? ఉద్యోగం చేయాలా అన్నది వ్యక్తిగత నిర్ణయం. ఎందుకంటే ప్రతి ఒక్కరి నిర్ణయాన్ని ఆర్థిక స్థోమత, కుటుంబ పరిస్థితులు ప్రభావితం చేస్తాయి.

ఎంటెక్‌ చేయాలి అనుకుంటే గేట్‌ 2025 రాసి మంచి ర్యాంకు సాధించాలి. ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీల్లోలాంటి వాటిల్లో ప్రవేశం పొందాలి. ప్రస్తుతుం మీరు చదువుతున్న బీటెక్‌ కాలేజీ కంటే మెరుగైన ర్యాంకున్న ఎంటెక్‌ కాలేజీని ఎంచుకోవాలి. అప్పుడే ఎక్కువ ఉపాధి అవకాశాలు ఎక్కువగా వస్తాయి. ఒకవేళ ఎంఎస్‌ చేసే ఆలోచనలో ఉంటే ఐఈఎస్‌టీఎస్‌/ టోఫెల్‌, జీఆర్‌ఈ లాంటి పరీక్షలు రాయాలి. వీటిలో మంచి స్కోరు సాధిస్తే విదేశాల్లో మంచి విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం లభిస్తోంది. ఎంటెక్‌/ ఎంఎస్‌లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌, డేటా సైన్స్‌ లాంటి సబ్జెక్టులు చదివే అవకాశముంటుంది.

బీటెక్​ చేయాలనుకునే వారికి గుడ్​న్యూస్​ - మేనేజ్​మెంట్ సీట్లపై సర్కార్ కీలక నిర్ణయం?

ప్రభుత్వ ఉద్యోగాలను సన్నద్ధం : ఉద్యోగం చేయాలి అనుకుంటే మీ కాళేజీల్లో ఏవైనా కంపెనీలు క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ కోసం వస్తే, వాటిలో మీరు పాల్గొన్నారా? పాల్గొంటే ఎలాంటి ఫలితాలు వచ్చాయి? మీకు కోర్‌ మెకానికల్‌పై ఆసక్తి ఉందా, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేయడం ఇష్టమేనా? అన్న ప్రశ్నలు మీకు మీరు వేసుకుని సమాధానాలు వేసుకోండి. జవాబు వచ్చాక ఉద్యోగం చేయాలా లేదా అన్న విషయంపై నిర్ణయానికి రండి. ఆ తర్వాత ప్రయత్నాలు మొదలుపెట్టండి.

కోర్‌ మెకానికల్ ఉద్యోగాలు చేయాలనుకుంటే ఆ కోర్సు సబ్జెక్టుల ప్రాథమిక అంశాలపై మంచి పట్టు ఉండాలి. అలాగ్ ఈ కోర్సుకు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. అయితే చాలా ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగాలు ఇచ్చేందుకు గేట్‌ స్కోరును ప్రాతిపదికగా తీసుకొంటున్నారు. ఆసక్తి ఉంటే యూపీఎస్‌సీ నిర్వహించే ఇండియన్‌ ఇంజినీరింగ్ సర్వీస్‌ పరీక్ష రాయండి. అవసరమైతే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు సంబంధించి కోర్సులు నేర్చుకోవాలి.

కోల్‌ ఇండియాలో 640 MT పోస్టులు - పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే జాబ్‌ - అప్లై చేసుకోండిలా!

బీటెక్ ఫస్ట్ ఇయర్​లో 9,677 విద్యార్థులు ఫెయిల్ - జేఎన్టీయూలో ఏం జరుగుతోంది? - PASSING PERCENTAGE DROP IN JNTUH

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.