ETV Bharat / offbeat

మీరు ఎప్పుడూ ట్రైచేయని "కోడిగుడ్డు వేపుడు" - జిందగీ ఖుష్ అనాల్సిందే! - HOW TO MAKE EGG FRY RECIPE

-ఎగ్ ఫ్రై అద్దిరిపోయే రెసిపీ ఇది - ఎంతో ఇష్టంగా లాగిస్తారు!

How to Make Egg Fry Recipe
How to Make Egg Fry Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 14 hours ago

How to Make Egg Fry Recipe in Telugu: మనలో చాలా మంది ఇంట్లో కోడిగుడ్డు ఉంటే ఈజీగా అవుతుందని ఆమ్లెట్ వేసుకుంటాం. ఇంకాస్త టైమ్ ఉంటే గుడ్డు పులుసో, పొరటో, కూరో వండేస్తాం. అయితే, ఎగ్స్​తో ఎప్పుడూ రొటీన్ వంటలు కాకుండా ఓ సారి ఈ స్టైల్​లో కోడిగుడ్డు వేపుడు ట్రై చేయండి. టేస్ట్ అద్దిరిపోతుంది! పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మరి, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • కోడిగుడ్లు - 7
  • నూనె - 2 టేబుల్​స్పూన్లు
  • ఉప్పు - అరటీస్పూన్
  • కారం - అరటీస్పూన్
  • పసుపు - అరటీస్పూన్
  • మిరియాల పొడి - పావుటీస్పూన్
  • పోపు దినుసులు - 1 టేబుల్​స్పూన్
  • ఎండుమిర్చి - 3
  • ఉల్లిపాయలు - 3(పెద్ద సైజ్​వి)
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

వెల్లుల్లి కారం కోసం :

  • కారం - 2 టేబుల్​స్పూన్లు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • ధనియాలు - 1 టీస్పూన్
  • వెల్లుల్లి రెబ్బలు - 20 నుంచి 25

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఎగ్స్​ని ఉడికించి పొట్టు తీసుకోవాలి. ఆపై వాటికి చాకు సహయంతో రెండు వైపులా గాట్లు పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయలను సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఒక టేబుల్​స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక అందులో గాట్లు పెట్టుకున్న కోడిగుడ్లు, ఉప్పు, కారం, పావుటీస్పూన్ చొప్పున పసుపు, మిరియాల పొడి వేసుకొని లో ఫ్లేమ్ మీద ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ గుడ్లకు పట్టేలా వేయించుకోవాలి. ఆపై వాటిని ఒక ప్లేట్​లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • అనంతరం అదే పాన్​లో మరో టేబుల్​స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక పోపు దినుసులు(ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు) వేసుకొని ఆవాలు చిటపటమనే వరకు వేయించుకోవాలి.
  • అవి వేగాక ఎండుమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు వేసి ఆనియన్స్ మెత్తబడే వరకు లో ఫ్లేమ్ మీద మధ్యమధ్యలో కలుపుతూ వేయించుకోవాలి.
  • అలా వేయించుకునేటప్పుడు ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. ఆ టైమ్​లోనే కరివేపాకు కూడా వేసుకోవాలి.
  • అవి వేగే లోపు మిక్సీ జార్ తీసుకొని అందులో కారం, ఉప్పు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగాయనుకున్న తర్వాత అందులో ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం వేసి మొత్తం కలిసేలా చక్కగా మిక్స్ చేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లను వేసి చక్కగా కలిపి లో ఫ్లేమ్ మీద మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక ఆఖర్లో కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే "కోడిగుడ్డు వేపుడు" రెడీ!
  • దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని కలిపి తింటుంటే ఆ టేస్ట్ వేరే లెవల్​లో ఉంటుంది.

దాబా స్టైల్ "తందూరీ ఎగ్​ కర్రీ"- అన్నం, చపాతీల్లోకి సూపర్ కాంబో - ఇలా ప్రిపేర్ చేయండి!

అన్నం, పులావ్‌, రోటీలకు మంచి కాంబినేషన్‌ - టేస్టీ "పాలక్ ఎగ్ కర్రీ" - ఈజీగా చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.