Horoscope Today December 23rd 2024 : డిసెంబర్ 23వ తేదీ (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. లక్ష్మీకటాక్షంతో సిరిసంపదలు వృద్ధి చెందుతాయి. అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో సానుకూలత ఉంటుంది. ఈ రోజంతా సరదాగా, నవ్వుతూ, సంతృప్తిగా ఉంటారు. వ్యాపారులు నూతన ఆవిష్కరణలతో అధిక లాభాలు పొందుతారు. బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ప్రయాణాలు అనుకూలం. ఇష్ట దేవతారాధన శుభకరం.
వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన సమావేశాలలో ముక్కుసూటి మనస్తత్వంతో, వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన ఫలితాలను అందుకుంటారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో సందిగ్ధత, అనిశ్చితి నెలకొంటుంది. భావోద్వేగాలు అదుపు తప్పుతాయి. కుటుంబ సభ్యులతో అనుబంధం దృఢ పడుతుంది. ఇంటా బయటా కలహాలు రాకుండా జాగ్రత్త పడండి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. శివారాధన శ్రేయస్కరం.
కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సన్నిహితుల సహాయంతో వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు. స్నేహితుల సహకారంతో నూతన ఆదాయ వనరులు ఏర్పడుతాయి. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వృత్తి పరంగా ఎదగడానికి చేసే అన్ని ప్రయత్నాలూ ఫలిస్తాయి. కుటుంబంతో విహారయాత్రలకు వెళ్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు సాధిస్తారు. శ్రీలక్ష్మీ గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.
సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో పురోగతి మందగిస్తుంది. ఆర్థికంగా ఎదగడానికి చేసే ప్రయత్నాలకు ఫలితాలు ఆలస్యం కావచ్చు. వ్యాపారంలో లాభాలు ఆశించిన స్థాయిలో ఉండవు. నిరాశ చెందవద్దు. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కార్యసిద్ధి హనుమ ఆరాధన మేలు చేస్తుంది.
కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు, అసైన్మెంట్లు ప్రారంభించడానికి ఈ రోజు చాలా మంచి రోజు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. స్నేహితులతో, ప్రియమైన వారితో సరదాగా గడుపుతారు. ప్రయాణాలు అనుకూలం. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.
తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు వ్యతిరేక ఫలితాలు ఉండవచ్చు. మీ కోపం, పరుష పదాల కారణంగా సన్నిహితులతో సంబంధాలు దెబ్బతింటాయి. కాబట్టి వీలైనంత వరకు ఈ రోజు మౌనంగా ఉండడం శ్రేయస్కరం. వ్యాపారంలోనూ ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఆదాయం ఆశించిన మేరకు ఉండదు. న్యాయపరమైన లావాదేవీలు, కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. కోపాన్ని అదుపులో ఉంచుకోడానికి ప్రయత్నించండి. నరసింహస్వామి ఆలయ సందర్శనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృత్తి, వ్యాపారాలలో ఈ రోజు అరుదైన అవకాశాలను అందుకుంటారు. చేపట్టిన ప్రతీ పనిలోనూ విజయం సాధిస్తారు. మీ పనితీరును ఉన్నతాధికారులు మెచ్చుకుంటారు. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి తారాబలం అనుకూలంగా ఉంది. ఆదాయం పదింతలు పెరుగుతుంది. శ్రీలక్ష్మీ ధ్యానం శుభప్రదం.
ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. సమావేశాలలో, చర్చలలో మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతుంది. కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. స్నేహితులతో విందు, వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారులు భాగస్వాములతో కొత్తగా చేసుకునే ఒప్పందాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈశ్వరాలయం సందర్శన శుభకరం.
మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. మీ మనస్సుకు నచ్చిన వ్యక్తిని కలుసుకుంటారు. కుటుంబ శ్రేయస్సు కోసం పనిచేస్తారు. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉంటాయి. రుణభారం తగ్గుతుంది. దైవబలం అండగా ఉంది. కాబట్టి ఏ పని చేపట్టినా విజయం సిద్ధిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఉత్తమం.
కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పని ఒత్తిడి అధికం కావడం వల్ల విశ్రాంతి లోపిస్తుంది. మీ కోసం కొంత సమయం కేటాయించుకొని ప్రశాంతంగా గడపండి. ఓ సంఘటన కలవర పెడుతుంది. వాస్తవాలను గ్రహించి సమయానుకూలంగా నడుచుకోవడం ఉత్తమం. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. గణపతి పంచరత్న స్తోత్ర పారాయణ మెరుగైన ఫలితాలను అందిస్తుంది.
మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సినీ, మీడియా, కళారంగం వారికి అనుకూలంగా ఉన్నందున మంచి అవకాశాలు అందుకుంటారు. సంపాదన పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలకు అనుకూలం. బంధు మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. వృత్తి పరంగా మీరు సాధించిన విజయం మీకు మంచి గుర్తింపు తెస్తుంది. శివ పంచాక్షరీ మంత్ర జపం సత్ఫలితాలను ఇస్తుంది.