Shiva Annapureddy Facebook Account Disabled : న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై(Judiciary) అసభ్య దూషణల కేసులో నిందితుడైన మణి అన్నపురెడ్డి తన రూపం, పేరు మార్చేసుకుని 'శివ అన్నపు రెడ్డి' పేరిట ఇంత కాలం కొనసాగిస్తున్న ఫేస్‌బుక్ ఖాతాను(Facebook Account) తొలగించేశారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత కూడా ఫేస్బుక్లో ఆయన అకౌంట్ కొనసాగింది. 'సీబీఐ వెతుకుతున్న నిందితుడు సీఎంజగన్ పక్కనే అనే శీర్షికతో ఈనాడు పత్రిక ప్రధాన సంచికలో మంగళవారం ప్రచురితమైన కథనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో తన ఉనికి ఎవరికి చిక్కకుండా ఉండేందుకు మంగళవారం ఉదయానికల్లా ' శివ అన్నపురెడ్డి' పేరుతో ఉన్న ఫేస్‌బుక్ ఖాతాను ఆయన తొలగించారు.
Accused Of Using Foul Language On Judges : న్యాయమూర్తులపై దూషణల కేసులో సీబీఐ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నమణి అన్నపురెడ్డి ఇటీవల అమెరికా నుంచి స్వదేశానికి తిరిగొచ్చి, శివ అన్నపురెడ్డి పేరుతో చలామణి అవుతున్నారు.వైసీపీయూఎస్ఏ కన్వీనర్‌గా ఉన్న ఆయన దర్యాప్తు సంస్థకు చిక్కకుండా, తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు రూపం మార్చుకొని అధికార పార్టీ(Ruling Party) ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిలతో చేతుల్లో చేయి వేసుకొని మరీ ఫొటోలు దిగారు. వాటిని ఎప్పటికప్పుడు ' శివ అన్నపు రెడ్డి' పేరుతో ఉన్న ఫేస్‌బుక్ అకౌంట్లో పోస్టు చేస్తున్నారు. అధికార పార్టీకి మద్దతుగా పోస్టు చేస్తున్నారు. అన్ని రకాల ఆధారాలు, ఫొటోలతో ఈనాడు పత్రికలో ప్రచురించటంతో ఉలిక్కిపడి, తన ఫేస్‌బుక్ అకౌంటును తొలగించేశారు.
సీఎం జగన్ దాడి ఘటనలో సుస్పష్టంగా భద్రతా వైఫల్యం - లోపభూయిష్ఠంగా సిబ్బంది తీరు - AP ELECTIONS 2024