తెలంగాణ

telangana

ETV Bharat / politics

ఆ విషయం ఇప్పుడు అర్థమైందా? - ఖర్గే వ్యాఖ్యలపై కేటీఆర్​ కౌంటర్​ - KTR REACTS ON KHARGE COMMENTS

ఆరు గ్యారంటీలతో వల వేసినప్పుడు తెలంగాణ బడ్జెట్ గురించి తెలియదా? - తెలంగాణలో కాంగ్రెస్ ఈ తప్పు చేస్తున్నప్పుడు, ఈ విషయాలు ఎందుకు గుర్తుకురాలేదు : కేటీఆర్

KTR Reacts On Mallikarjun Kharge Comments
KTR Reacts On Mallikarjun Kharge Comments (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 1, 2024, 10:58 PM IST

KTR Reacts On Mallikarjun Kharge Comments :తెలంగాణ ప్రజలను నమ్మించి, నయవంచన చేసినందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను ఉద్దేశించి సామాజిక మాధ్యమం ఎక్స్​లో ఆయన ఘాటుగా స్పందించారు. గాలిమాటల గ్యారెంటీలిస్తే, మొదటికే మోసం వస్తుందని ఇప్పుడు అర్థమైందా అని ప్రశ్నించారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ప్రకటించినప్పుడు ఆ రాష్ట్ర బడ్జెట్ గుర్తు రాలేదా అని అడిగారు. బడ్జెట్ చూసుకోకుండా హామీలిస్తే.. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తప్పదని ఇప్పుడు బోధపడిందా అని కేటీఆర్ ఆక్షేపించారు.

ఆరు గ్యారంటీలతో వల వేసినప్పుడు తెలంగాణ బడ్జెట్ గురించి తెలియదా అన్న ఆయన, తెలంగాణలో కాంగ్రెస్ ఈ తప్పు చేస్తున్నప్పుడు ఈ విషయాలు ఎందుకు గుర్తుకురాలేదని అడిగారు. కేవలం అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ఆడిన గ్యారెంటీల గారడీతో.. తెలంగాణ రాష్ట్రం ఏడాదిలోనే ఆగమైందని ఆరోపించారు. దశాబ్దంపాటు ప్రగతిపథంలో పరుగులు పెడుతున్న తెలంగాణను అడ్డగోలు హామీలతో మభ్యపెట్టినందుకు తప్పు ఒప్పుకోవాలని కేటీఆర్ అన్నారు. అనాలోచితంగా ఇచ్చే కాంగ్రెస్ గ్యారెంటీలతో, భవిష్యత్ తరాలకు కూడా నష్టం జరుగుతుందని ఇప్పటికైనా గుర్తించినందుకు సంతోషమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ గ్యారెంటీలను నమ్మిన పాపానికి, ఏడాదికాలంగా రాష్ట్రానికి జరిగిన నష్టం పూడ్చలేనిదన్న ఆయన, గ్యారెంటీల మాటున కాంగ్రెస్ చేసిన మోసం క్షమించలేనిదని తప్పుపట్టారు.

"గౌరనీయులైన మల్లిఖార్జున ఖర్గే గారు.. గాలిమాటల గ్యారెంటీలిస్తే.. మొదటికే మోసం వస్తుందని ఇప్పుడు అర్థమైందా? కర్ణాటక స్టేట్​లో ఐదు గ్యారంటీలు ప్రకటించినప్పుడు ఆ రాష్ట్ర బడ్జెట్ గుర్తు రాలేదా? బడ్జెట్ చూసుకోకుండా హామీలిస్తే.. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తప్పదని ఇప్పుడు బోధపడిందా ? ఆరు గ్యారంటీలతో వల వేసినప్పుడు తెలంగాణ బడ్జెట్ గురించి తెలియదా? తెలంగాణలో కాంగ్రెస్ ఈ తప్పు చేస్తున్నప్పుడు, ఈ విషయాలు ఎందుకు గుర్తుకురాలేదు. ఏవీ చూసుకోకుండా, కేవలం అధికారమే లక్ష్యంగా హస్తం పార్టీ ఆడిన గ్యారెంటీల గారడీతో, తెలంగాణ రాష్ట్రం ఏడాదిలోనే ఆగమైంది. తెలంగాణ ప్రజలను నమ్మించి, నయవంచన చేసినందుకు కాంగ్రెస్ పార్టీ.. నాలుగు కోట్ల ప్రజలకు క్షమాపణలు చెప్పాలి." -కేటీఆర్​ ట్వీట్​

రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తా! - ఎక్స్​లో ప్రకటించిన కేటీఆర్

ఒక దశలో పాలిటిక్స్​ నుంచి వైదొలగాలనుకున్నా : కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details