KTR Election Campaign in Sircilla 2024 :తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి గెలిచిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హమీలను మరిచిందని ధ్వజమెత్తారు. రాజన్న సిరిసిల్ల పట్టణంలోని వెంకంపేట చౌరస్తాలో కరీంనగర్ అభ్యర్థి వినోద్ కుమార్కు మద్దతుగా ప్రచారం నిర్వహించిన ఆయన, కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. సిరిసిల్లలోని చేనేత కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో చేనేత కార్మికులకు ఉపాధి ఉండేదని, ఇప్పుడు బతుకమ్మ చీరల ఆర్డర్ ఇవ్వకుండా నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో సిరిసిల్లలో చేసిన అభివృద్ధిని వివరించారు.
ఆ మూడు స్థానాలపై కేటీఆర్ స్పెషల్ ఫోకస్ - గెలుపే లక్ష్యంగా ప్రచారం - BRS FOCUS ON GREATER HYDERABAD
"రాష్ట్రంలో 4 నెలల్లో లక్ష పెళ్లిళ్లు జరిగాయి. వారికి రూ.లక్ష, తులం బంగారం, వృద్ధులకు రూ.4000 పింఛన్ వచ్చిందా? పార్లమెంటులో గట్టిగా కొట్లాడే వినోద్ కుమార్ను గెలిపించాలి. గుళ్లు కట్టుడే ప్రాచీన శిల్ప కళకు అద్దం పట్టేలా యాదాద్రి కట్టిండు. కేసీఆర్ మిడ్ మానేరు కట్టి సిరిసిల్లలో సముద్రం తీసుకు వచ్చిండు. మోదీ నుంచి ఒక్క రూపాయి అన్న లాభం జరిగిందా? ఆయనకు ఎందుకు ఓటు వేయాలి. ఈ ఎన్నికల్లో చెయ్యి విరిగిపోవాలే - పువ్వు వాడిపోవాలే - కారు రయ్యుమని ఉర్కాలే" - కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు