ED Searches Patancheru MLA House : బీఆర్ఎస్కు చెందిన పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు జరుపుతోంది. పటాన్‌చెరులోని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి నివాసం, అతని సోదరుడు మధుసూదన్‌రెడ్డి నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి పటాన్‌చెరులోని మూడు ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి.
గతంలో లగ్డారం గనుల వ్యవహారంలో పటాన్చెరు పోలీసులు గతంలో మధుసూదన్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. క్రషర్కు సంబంధించి తహసీల్దార్ ఫిర్యాదు మేరకు పటాన్చెరు పోలీసులు గతంలో సోదాలు జరిపి, నిర్వహించిన మధుసూదన్‌రెడ్డిని అరెస్టు చేశారు. అనంతరం సంగారెడ్డి జైలుకు కూడా తరలించారు. ఈ కేసు ఆధారంగానే ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది.