తెలంగాణ

telangana

ETV Bharat / politics

రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీసేలా సీఎం మాట్లాడటం సరికాదు : దాసోజు శ్రవణ్ కుమార్​ - Dasoju on BJP Congress Relation

Dasoju Sravan Kumar Fire on CM Revanth Reddy : బీఆర్ఎస్ సీనియర్ నేత సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య స్ఫూర్తిని నేర్చుకోవాలని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్​ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. గవర్నర్​ ఎమ్మెల్సీ నియామక విషయంలో సంతకం చేయడం దీనికి నిదర్శనగా మారిందని ధ్వజమెత్తారు.

Dasoju Sravan Kumar Fire on CM Revanth Reddy
Dasoju Sravan Kumar Shocking Comments

By ETV Bharat Telangana Team

Published : Jan 27, 2024, 7:36 PM IST

Dasoju Sravan Kumar Fire on CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ గౌరవానికి భంగం కలిగిస్తున్నారని బీఆర్ఎస్​ సీనియర్ నేత దాసోజు శ్రవణ్(BRS Leader Dasoju Sravan Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సాధన కోసం జీవితాన్ని పణంగా పెట్టిన కేసీఆర్​ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం రేవంత్ రెడ్డికి సరికాదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డిని కాదు సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన రాహుల్ గాంధీ, ఖర్గే, కాంగ్రెస్ నేతలను అనాలని శ్రవణ్ వ్యాఖ్యానించారు.

త్వరలో బీఆర్ఎస్ లోక్​సభ అభ్యర్థుల జాబితా - కేసీఆర్, కేటీఆర్​ పోటీపై ఇదే క్లారిటీ

Dasoju Sravan Kumar Shocking Comments on CM : బీఆర్ఎస్​ను వంద అడుగుల లోతులో పాతి పెడతారా అని దాసోజ్​ శ్రవణ్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సంస్కారం చేసుకోవాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్​ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయాలని అన్నారు. చేయని పక్షంలో ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి నేర్చుకోవాలని సూచించారు.

అదానీతో రేవంత్‌ రెడ్డి దిల్లీలో కుస్తీ, దావోస్‌లో దోస్తీ : దాసోజ్‌ శ్రవణ్‌

"రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ జీవితాన్ని పణంగా పెట్టారు. కేసీఆర్‌ను ఇష్టారీతిన సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడటం తగదు. సీఎం ప్రజాస్వామ్య స్ఫూర్తి నేర్చుకోవాలి. కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కయ్యాయి. సీఎం రేవంత్‌రెడ్డి కలవగానే గవర్నర్ సంతకం చేస్తున్నారు. గతంలో కేటీఆర్ అంతర్జాతీయ వేదికలపై తెలంగాణకు గౌరవాన్ని తీసుకువచ్చారు. ప్రభుత్వంలో ఉన్న అభినవ బిల్లారంగాలు రేవంత్​ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రేవంత్​ రెడ్డి ప్రజాస్వామ్య స్ఫూర్తి నేర్చుకోవాలి."- దాసోజు శ్రవణ్ కుమార్, బీఆర్ఎస్ సీనియర్ నేత

Dasoju Sravan on BJP, Congress Relation :కాంగ్రెస్, బీజేపీతో పూర్తి స్థాయిలో కలిసి పనిచేస్తున్నాయని శ్రవణ్ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కోసం అదానీకి తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టారని అన్నారు. పదేళ్లుగా శకటానికి అనుమతి ఇవ్వని కేంద్రం రేవంత్​ అడగగానే ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ విషయంలో రేవంత్​ రెడ్డి, గవర్నర్​ తమిళి సై(Governor Tamil Sy)ని కలవగానే సంతకం పెట్టారని ఆరోపించారు. ఈ విషయం ద్వారా కాంగ్రెస్​, బీజేపీ కలిసిపోయాయని అన్నారు. కృష్ణా ప్రాజెక్టుల విషయంలో కేంద్రంపై పోరాటం చేయాలని తెలిపారు.

రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీసేలా సీఎం మాట్లాడం సరికాదు దాసోజు శ్రవణ్ కుమార్​

Governor Tamilisai Rejected Nominated Quota MLCs Names : నామినేటెడ్‌ కోటా ఎమ్మెల్సీల పేర్లను తిరస్కరించిన గవర్నర్ తమిళిసై

ABOUT THE AUTHOR

...view details