తెలంగాణ

telangana

ETV Bharat / politics

కూల్చాల్సి వస్తే మొదట హైడ్రా కార్యాలయాన్నే కూల్చాలి : కేటీఆర్ - KTR Fires on Hydra - KTR FIRES ON HYDRA

KTR Fires on Hydra Demolitions : మూసీ పరివాహకంలో కూల్చివేతలు చేస్తే మొదట హైడ్రా కార్యాలయాన్ని కూల్చాలని బీఆర్​ఎస్​ నేత కేటీఆర్​ పేర్కొన్నారు. మూసీ నది సుందరీకరణతో రాష్ట్రానికి ఎంత ఆదాయం తిరిగి వస్తుందని అడిగారు. మూసీ పరివాహక ప్రజల పాలిట సీఎం కాలయముడిగా మారారని ఆరోపించారు.

KTR Fires on Hydra Demolitions
KTR Fires on Hydra Demolitions (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 30, 2024, 4:03 PM IST

Updated : Sep 30, 2024, 7:09 PM IST

BRS Leader KTR on HYDRA : "వందరోజుల్లోనే హామీలన్నీ నెరవేరుస్తామని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. వందరోజుల్లో చేస్తామన్న పనులను 300 రోజులు దాటినా చేయడం లేదు. ఇప్పటివరకు ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేదు. మూసీ పరివాహక ప్రజల పాలిట సీఎం రేవంత్​ రెడ్డి కాలయముడిగా మారారు. కాంగ్రెస్​ ప్రభుత్వం హయాంలోనే మాకు పట్టాలు వచ్చాయని ప్రజలు చెప్తున్నారు. రిజిస్ట్రేషన్​ చేసినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు చెప్తున్నారని పేదలు అడుగుతున్నారు." అని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ, ఇల్లు అనేది ప్రజలకు ఉద్వేగంతో కూడిన అనుబంధం అని కేటీఆర్​ తెలిపారు. అన్ని అనుమతులు తీసుకుని కట్టుకున్న ఇళ్లను ఎలా కూల్చుతారని ప్రశ్నించారు. ప్రభుత్వమే గుర్తించిన ఇళ్లను ఎందుకు కూల్చుతున్నారని గట్టిగా అడిగారు. గతంలో 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్​ చెరువులకు హద్దులు ఎందుకు గుర్తించలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. ఎఫ్​టీఎల్​లో నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదన్నారు. ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రాధాన్యతలు ఉన్నాయా? కేవలం మూసీ పైనే రూ.1.50 లక్షల కోట్లు కేటాయిస్తారా? అని కేటీఆర్​ పేర్కొన్నారు.

బుద్ధభవన్​ కూల్చుతారా : 2400 కిలోమీటర్లు ఉన్న గంగా నది కోసం కేవలం రూ.40 వేల కోట్లు కేటాయించారని కేటీఆర్​ అడిగారు. కూల్చాల్సి వస్తే మొదట హైడ్రా కమిషనర్​ కార్యాలయం కూల్చాలని సూచించారు. ఎఫ్​టీఎల్​లోనే నిర్మించిన బుద్ధభవన్​ను కూడా కూల్చాలన్నారు. ఎఫ్​టీఎల్​లోనే నిర్మించిన జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయం సైతం కూల్చేయాలన్నారు.

బుల్డోజర్లకు అడ్డుగా బీఆర్​ఎస్​ : "కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం. మూసీ సుందరీకరణతో రాష్ట్రానికి ఎంత ఆదాయం తిరిగి వస్తుంది. రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తే ఎన్ని ఎకరాలకు నీరు అందుతుంది. ఎవరి కమీషన్లు కోసం మూసీ సుందరీకరణ అంటున్నారు. పింఛన్లను రూ.4 వేలకు ఇంకా ఎందుకు పెంచటం లేదు. ఇళ్లు కట్టిస్తామన్నారు కానీ కూల్చుతామని ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు కదా. ప్రజలు తిరగబడితే మంత్రులు ఊళ్లల్లో కూడా తిరగలేరు. పేద ప్రజల ఇళ్లు కూల్చుతుంటే మేము చూస్తూ ఊరుకోం. ఇకపై బుల్డోజర్లకు అడ్డుగా బీఆర్​ఎస్​ నేతలు ఉంటారు." అని కేటీఆర్​ తెలిపారు.

కూకట్‌పల్లి నల్ల చెరువులోని ఆక్రమణలపై హైడ్రా పంజా -​ 16 నిర్మాణాలు నేలమట్టం - HYDRA DEMOLITIONS IN HYDERABAD

లేక్‌ వ్యూ భవనాలపై హైడ్రా ఫోకస్ - యజమానుల్లో మొదలైన హడల్ - HYDRA ON LAKE VIEW APARTMENTS

Last Updated : Sep 30, 2024, 7:09 PM IST

ABOUT THE AUTHOR

...view details