ETV Bharat / sports

'పారిపోవద్దు రోహిత్, ఫైట్ చెయ్'- హిట్​మ్యాన్​కు మాజీ క్రికెటర్ సూచన - ROHIT SHARMA 5TH TEST

రోహిత్​ శర్మపై ఇర్ఫాన్ పఠాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్- సిడ్నీ టెస్టు ఆడాలంటూ సూచన!

Rohit Sharma
Rohit Sharma (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Jan 2, 2025, 8:32 PM IST

Irfan Pathan On Rohit Sharma : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సిడ్నీ టెస్టు నుంచి తప్పుకున్నాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో మాజీ ఆల్​రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అతడి ఫామ్​పై కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొని పోరాడాలని పఠాన్ సూచించాడు. సిడ్నీ టెస్టులో రాణించి కఠిన పరిస్థితుల నుంచి రోహిత్ బయటపడాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపాడు.

'సిడ్నీ టెస్టులో రోహిత్ రాణించాలి'
'సిడ్నీ టెస్టులో రోహిత్‌ ఎక్కువ పరుగులు చేసి టీమ్ఇండియాను గెలిపించాలి. నా అభ్యర్థనను రోహిత్ శర్మ పాటిస్తాడు. కఠిన పరిస్థితుల నుంచి పారిపోవద్దని రోహిత్ శర్మకు నా అభ్యర్థన. అతడు ఈ పరిస్థితుల నుంచి బయటపడి రాణించాలి. ఇది నా వ్యక్తిగత కోరిక. అయితే రోహిత్ ఫామ్​లో లేడన్నది నిజం. కానీ రోహిత్ శర్మ బ్యాటింగ్​లో రాణించాలి' అని ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించాడు.

కూర్పుపై పఠాన్
అలాగే సిడ్నీ టెస్టులో ప్లేయింగ్ ఎలెవన్​లో మార్పుల గురించి పఠాన్ స్పందించాడు. మెల్‌ బోర్న్ టెస్టులో జట్టులో మార్పులు చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. చివరి మ్యాచ్​లో చాలా మార్పులు చేయడం అంత మంచిదికాదని తెలిపాడు.

దారుణంగా విఫలం
కాగా, టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్​పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జనవరి 3న సిడ్నీలో జరగబోయే టెస్టుకు రోహిత్ ను తప్పిస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో రోహిత్ ఫామ్ పై ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

సగటు 6 మాత్రమే
పెర్త్​లో జరిగిన తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరమయ్యాడు. ఆ తర్వాత అడిలైడ్‌ లో జరిగిన రెండో టెస్టుకి అందుబాటులోకి వచ్చాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో రోహిత్ ఇప్పటివరకు ఐదు ఇన్నింగ్స్‌ ల్లో 6.20 సగటుతో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో రోహిత్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఆధిక్యంలో ఆసీస్
ఇక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో మెల్‌ బోర్న్‌ టెస్టులో విజయంతో ఆస్ట్రేలియా ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉంది. ఆఖరి టెస్టు సిడ్నీ వేదికగా జనవరి 3న జరగనుంది. ఇందులో గెలిచి సిరీస్‌ ను భారత్‌ సమం చేయాలని భారత్ ప్రయత్నిస్తోంది. ఈ మ్యాచ్ లోనూ విజయకేతనం ఎగురవేసి 3-1తో సిరీస్ ను గెలుచుకోవాలని ఆసీస్ ఉవ్విళ్లూరుతోంది.

సిడ్నీ టెస్టుకు రోహిత్ దూరం!- కెప్టెన్​ రేస్​లో విరాట్?

సిడ్నీ టెస్టుకు టీమ్ఇండియాలో​ భారీ మార్పులు- రోహిత్‌ ప్లేస్​లో గిల్- విజయంతో ముగిస్తారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.