Meerpet Murder case Update : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మీర్‌పేట మహిళ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భార్యను హతమార్చి మృతదేహాన్ని ముక్కలుగా చేసి మాయం చేసిన ఈ కేసులో నిందితుడు గురుమూర్తితో పాటు మరో ముగ్గురి పేర్లను కూడా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. గురుమూర్తి సోదరి సుజాత, తల్లి సుబ్బలక్ష్మమ్మ, సోదరుడు కిరణ్‌లను నిందితులుగా చూపారు. గురుమూర్తి మీద హత్యకు సంబంధించి సెక్షన్లు నమోదు చేయగా మిగిలిన ముగ్గురిపైనా బీఎన్‌ఎస్‌లోని 85 సెక్షన్(గృహహింస) ప్రయోగించారు. మరోవైపు గురుమూర్తి రిమాండు రిపోర్టులోని విస్మయకర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఏపీలోని ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన పుట్టా గురుమూర్తికి అదే గ్రామానికి చెందిన వెంకట మాధవికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జిల్లెలగూడలోని వెంకటేశ్వర కాలనీలోని నివాసం ఉంటున్నాడు. ఏళ్ల క్రితం కుటుంబంతో కలిసి సొంతూరు జేపీ చెరువులో ఉన్న సమయంలో కుటుంబ కలహాలు మొదలయ్యాయి. దీనిపై భార్య పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టించింది.
సొంతూర్లో పంచాయతీ పెట్టించడం, అవమాన భారంతో తిరిగి అక్కడికి వెళ్లలేని పరిస్థితులు ఏర్పడినట్లు భావించి వెంకటమాధవి అడ్డు తొలగించుకోవాలని గురుమూర్తి స్కెచ్ వేశాడు. ఈ ఏడాది సంక్రాంతికి తన పథకాన్ని అమలుచేయాలనుకున్నాడు. జనవరి 15వ తేదీన బడంగ్‌పేట్‌లో ఉండే తన సోదరి సుజాత ఇంటికి గురుమూర్తి తన భార్య ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లాడు.
మృతదేహాన్ని ముక్కలుగా చేసి : ఏళ్లుగా సొంతూరుకు వెళ్లడం లేదని ఈ సారైనా తన పుట్టింటికి వెళ్తానని వెంకట మాధవి చెప్పగా గురుమూర్తి గొడవపడ్డాడు. మీ సోదరి ఇంట్లో ఉండడం ఇష్టంలేదని తెగేసి చెప్పింది. దీంతో పిల్లల్ని అక్కడే వదిలేసి జిల్లెలగూడలోని ఇంటికి తీసుకొచ్చాడు. 16వ తేదీ పుట్టింటికి వెళ్లే విషయంలో మళ్లీ గొడవ మొదలవ్వడంతో గురుమూర్తి భార్య తలను గోడకు కొట్టి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు చేసి వాటర్‌హీటర్‌తో వేడి నీటిలో ఉడకబెట్టాడు. ఎముకల్ని పొడిగా మార్చి మిగిలిన మాంసం ముక్కల్ని బకెట్ వేసి జిల్లెలగూడలోని పెద్దచెరువులో విసిరేశాడు.
తల్లి శవాన్ని ముక్కలు చేసిన బాత్రూంనే వాడిన పిల్లలు - మీర్‌పేట హత్య కేసులో సంచలన విషయాలు
మీర్‌పేటలో దారుణం - భార్యను కుక్కర్లో ఉడికించి, రోటిలో దంచి హతమార్చిన భర్త