ETV Bharat / entertainment

'పుష్ప 2' కలెక్షన్ల సునామీ- 'బాహుబలి 2' రికార్డ్ బ్రేక్ అవ్వడం పక్కా! - PUSHPA 2 COLLECTIONS

పుష్ప 2 బాక్సాఫీస్ వసూళ్లు- మరో వారంలో ఆ రికార్డ్ బ్రేక్!

Pushpa 2 Collections
Pushpa 2 Collections (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 2, 2025, 8:48 PM IST

Pushpa 2 Collection Worldwide : ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హవా కొనసాగుతోంది. ఆయన లీడ్​ రోల్​లో తెరకెక్కిన 'పుష్ప 2' డిసెంబర్ 5న రిలీజై అనేక రికార్డులు కొల్లగొట్టి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే సినిమా నాలుగు వారాల్లో రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించిందని మేకర్స్ తాజాగా తెలిపారు.

ఈ సినిమా ఇప్పటివరకు రూ.1799 కోట్ల గ్రాస్​ వసూల్ చేసింది. ఈ మేరకు మేకర్స్​ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. 'పుష్ప 2 : ది రూల్‌ రికార్డు బ్రేకింగ్‌ రన్‌తో ఇండియన్ బాక్సాఫీస్‌ను రూల్‌ చేస్తోంది. వైల్డ్ ఫైర్‌ బ్లాక్‌బస్టర్‌ నాలుగు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1799 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది' అని పోస్ట్​కు రాసుకొచ్చింది.

ఇక తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన 'బాహుబలి 2'కు ఇది అతి సమీపంలోకి వచ్చింది. 2017లో రిలీజైన బాహుబలి 2 రూ.1810 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ లెక్కన పుష్ప 2 మరో వారంలో 'బాహుబలి 2' వసూళ్లు క్రాస్ చేయడం పక్కా అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

హిందీలో రికార్డులు
మరోవైపు పుష్ప నార్త్ ఇండస్ట్రీని రూల్ చేస్తోంది. ఈ సినిమాకు ఉత్తరాదిలో విపరీతమైన క్రేజ్ వస్తోంది. ఒక్క హిందీ వెర్షన్​లోనే ఈ సినిమా రూ.1000 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకూ ఏ హిందీ వెర్షన్‌ సినిమా సాధించని రికార్డుగా చెబుతున్నారు. అలాగే టికెట్ల విక్రయంలోనూ 'పుష్ప 2' సరికొత్త రికార్డు సృష్టించింది. బుక్‌ మై షోలో 19.5మిలియన్‌ టికెట్లు అమ్ముడయ్యాయి. ఇప్పటివరకూ 'బాహుబలి 2' పేరిట ఉన్న రికార్డును 'పుష్ప 2' బ్రేక్ చేసింది కొట్టింది.

టార్గెట్ రూ.2వేల కోట్లు

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలేవీ లేదు. మరో వారం రోజులు పుష్ప హవానే కొనసాగే అవకాశం ఉంది. ఇదే జరిగితే రూ.2000 కోట్ల మార్క్ క్రాస్ చేయడం పెద్ద కష్టమేమీ కాదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

'పుష్ప 2' కలెక్షన్ల సునామీ- 21 రోజుల్లోనే రూ.1700 కోట్లు వసూల్

'పుష్ప 2' ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​ - ఇకపై దేశవ్యాప్తంగా ఆ ఫార్మాట్​లోనూ ప్రదర్శన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.