ETV Bharat / spiritual

ఈ వారం ఆ రాశుల వారికి వృత్తివ్యాపారాల్లో ఫుల్ ప్రాఫిట్- ఇష్ట దేవతారాధన శుభప్రదం - WEEKLY HOROSCOPE

జనవరి 5వ తేదీ నుంచి జనవరి 11వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే ?

Weekly Horoscope
Weekly Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 5, 2025, 4:08 AM IST

Weekly Horoscope From January 5th To January 11th 2025 : జనవరి 5వ తేదీ నుంచి జనవరి 11వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే ?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. సమయానుకూలంగా వ్యవహరించడం ద్వారా వృత్తి వ్యాపారాలలో సంక్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కుతారు. ఆర్ధిక క్రమశిక్షణ పాటించాలి. డబ్బును వృథా చేయకుండా జాగ్రత్తగా ఖర్చు చేయండి. పొదుపు ప్రణాళికలు చేపట్టకపోతే ఆర్థిక సంక్షోభం ఏర్పడే ప్రమాదముంది. కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరి. వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు. జీవిత భాగస్వామి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చు. ఉద్యోగంలో చెప్పుకోదగిన మార్పులేమీ ఉండవు. విద్యార్థులు కష్టపడి చదవకపోతే ఆశించిన ఫలితాలు ఉండవు. మానసిక ఒత్తిడితో అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆదిత్య హృదయం పారాయణతో మేలు జరుగుతుంది.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో ఆనందం నెలకొంటుంది. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్లి సరదాగా గడుపుతారు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఆర్థికంగా ఈ వారం సంపన్నవంతంగా ఉంటుంది. ఊహించని ధనలాభాలను అందుకుంటారు. వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు. వ్యాపారం నిమిత్తం దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. జీతం పెరుగుదల వంటి ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉండవచ్చు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారికి కలిసి వచ్చే సమయం. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. అనుకోని విధంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కొందరు మిత్రుల సహాయంతో ఆర్థిక వనరులు ఏర్పాటు చేసుకొని సంక్షోభం నుంచి గట్టెక్కుతారు. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు మరికొంత కాలం వేచి ఉండక తప్పదు. వ్యాపారుస్థులు గణనీయమైన లాభాలను గడిస్తారు. భాగస్వాముల సహకారంతో వ్యాపారాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు. వైవాహిక జీవితంలో సమస్యలు రాకుండా జాగ్రత్త వహించండి. జీవిత భాగస్వామి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం మంచిది. క్రీడాకారులు అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఆరోగ్యం మెరుగవుతుంది. అనారోగ్య సమస్యలు క్రమంగా తగ్గు ముఖం పడతాయి. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. శివారాధన శ్రేయస్కరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని సరదాగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాలలో సమయానుకూలంగా నడుచుకోవడం తప్పనిసరి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం తగదు. పని ప్రదేశంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారంలో పోటీ ఉండవచ్చు. నష్టాలు రాకుండా జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. అవసరానికి సరిపడా డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మిత్రుల సహాయంతో ఓ కీలక వ్యహారంలో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితంలో ఆనందం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు పట్టుదలతో విజయాన్ని అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటే ప్రశాంతత దొరుకుతుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా ఉన్నందున అన్ని రంగాల వారు చేపట్టిన పనిలో విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా సత్ఫలితాలను అందుకుంటారు. వృత్తి పరంగా మీ సృజనాత్మకత మంచి ఫలితాలు ఇస్తుంది. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. భూములు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంలో ఆనందం ఉండాలంటే మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. సమాజంలో పేరొందిన వ్యక్తులతో సమావేశం కావచ్చు. ఈ సమావేశం ముందు ముందు చాలా ఉపయోగపడుతుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు తొందరపడవద్దు. ప్రస్తుత ఉద్యోగంలోనే పురోగతికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు కష్టించి పనిచేస్తే విజయం సిద్ధిస్తుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. చిన్నపాటి అనారోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయవద్దు. నవగ్రహ శ్లోకాలు పఠించడం ఉత్తమం.

.

కన్య (Virgo) : కన్య రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలను అందుకుంటారు. ఒక అనుభవజ్ఞుని సహాయంతో మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఆదాయంలో పెరుగుదలను చూడవచ్చు. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగు పడుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు ఉండవచ్చు. మీ పనితీరుకు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. వ్యక్తిగత జీవితంలో సమస్యలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో అపార్థాల కారణంగా విభేదాలు రావచ్చు. మీ అనుబంధం పట్ల నిజాయితీగా ఉండడం మంచిది. ఖర్చులు గణనీయంగా పెరగవచ్చు. వ్యాపారుస్థులు నిజాయితితో ఉంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి. సంస్థ అభివృద్ధికి దోహదపడే వారితో పరిచయం మేలు చేస్తుంది. కుటుంబ శ్రేయస్సు పట్ల దృష్టి సారించాలి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శివ పంచాక్షరీ జపం శ్రేయస్కరం.

.

తుల (Libra) : తుల రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపారంలో లాభాల పంట పండుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. సహోద్యోగుల సహకారంతో అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. అదే సమయంలో ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం అవసరం. వృథా ఖర్చులు నివారించాలి. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు, తీర్ధ యాత్రలకు వెళ్తారు. అనుకోకుండా సంపదలు కలిసి వస్తాయి. ఉద్యోగస్థులు ప్రస్తుత ఉద్యోగంలో కొనసాగడం తెలివైన పని. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెడితే మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మీ ధ్యానం శుభప్రదం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశిలో వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారు ఈ వారం వృత్తి వ్యాపారాలలో తీరికలేని పనులతో బిజీగా ఉంటారు. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం చేకూరుతుంది. ఇతరులు అసూయపడేలా ఆర్థికంగా ఎదుగుతారు. గతంలో పోగొట్టుకున్న డబ్బును కూడా తిరిగి పొందుతారు. ఖర్చులు అదుపులోనే ఉంటాయి. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడపడం ఆనందాన్ని ఇస్తుంది. ఉన్నత విద్యను అభ్యసించే వారికి, ఈ వారం అనువైనది. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభకరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. సున్నితమైన విషయాల పట్ల తీవ్రంగా స్పందించవద్దు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశముంది. మిత్రుల సహకారంతో అదనపు ఆదాయ వనరులు ఏర్పాటు చేసుకుంటారు. కుటుంబంలో కలహాలు రాకుండా జాగ్రత్త పడండి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. వ్యాపారంలో భాగస్వాముల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. సమయానుకూలంగా నడుచుకుంటే పరిస్థితులు చక్కబడతాయి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే కలహాలు తప్పవు. ఖర్చులపై నియంత్రణ పాటించడం మంచిది. వ్యాపారుస్థులు విదేశీ కంపెనీతో ముఖ్యమైన ఒప్పందంపై సంతకం చేయవచ్చు. విద్యార్థులకు తీవ్రమైన కృషితోనే ఫలితం ఉంటుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. కార్యసిద్ధి హనుమ ఆరాధన శుభకరం.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. గతంలో ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. అసంపూర్తిగా ఉన్న వ్యాపారాన్ని లాభాలబాట పట్టిస్తారు. దీర్ఘకాలంగా నిలిపివేయబడిన సంస్థను పునరుద్ధరించడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత లోపిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు ఉండవచ్చు. ఉన్నతాధికారుల మద్దతుతో పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రశంసలు పొందుతారు. షేర్ మార్కెట్లో పెట్టుబడుల ద్వారా అధిక లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఓ శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఈశ్వరుని ఆలయ సందర్శన శుభకరం.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్హి కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. కెరీర్ పరంగా అనుభవజ్ఞుల సలహా మేరకు నడుచుకుంటే విజయం చేకూరుతుంది. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం అవసరం. వ్యాపారుస్థులు రుణభారం పెరగకుండా చూసుకోవాలి. భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు ప్రణాళికలు చేపట్టాలి. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇతరులను కించ పరిచేలా మాట్లాడే విధానం మానుకుంటే మంచిది. బంధువుల మధ్య ఏర్పడ్డ మనస్పర్థలు చర్చలతో పరిష్కరించుకోవాలి. జీవిత భాగస్వామి పట్ల గౌరవంతో మెలగాలి. విద్యార్థులు విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కార్యసిద్ధి హనుమ ఆరాధన మేలు చేస్తుంది.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగతంగా, వృత్తిపరమైన అంశాలలో విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. కెరీర్, స్థిరాస్తి వ్యాపార వెంచర్లలో పురోగతికి అవకాశం ఉంది. సన్నిహితల సహకారంతో ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు, స్వస్థాన ప్రాప్తి ఉన్నాయి. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. జీవిత భాగస్వామితో సుదీర్ఘ ప్రయాణాలు చేస్తారు. ఇది మీ బంధాన్ని మరింత దృఢ పరుస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో ఆనందం, ఐక్యత పెరుగుతుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.