ETV Bharat / politics

“జంగ్ సైరన్” ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టించింది : కేటీఆర్ - KTR COMMENTS ON BRS WORKERS

బీఆర్ఎస్​ కార్యకర్తలు చూపిన కదనోత్సాహం కొండంత స్ఫూర్తి నింపిందన్న కేటీఆర్​ - కార్యకర్తల పోరాటం వల్లే పలు కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చిందని వ్యాఖ్య

KTR Comments On BRS Workers
KTR Comments On BRS Workers (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 2, 2025, 7:56 PM IST

KTR Comments On BRS Workers : గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కనబరిచిన కదనోత్సాహం రాష్ట్ర స్థాయిలో పని చేసే నాయకత్వంలో కూడా కొండంత స్ఫూర్తి నింపిందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. 'ప్రాణ సమానులైన బీఆర్ఎస్ తోబుట్టువుల్లారా' అంటూ 'ఎక్స్' వేదికగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఆయన గత ఏడాది కాలంగా కాంగ్రెస్ నిరంకుశ పాలనపై కనబరిచిన పోరాట స్ఫూర్తికి శిరస్సు వంచి సలాం చేస్తున్నట్లు తన పోస్టులో పేర్కొన్నారు.

ప్రజల పక్షాన విరామం ఎరగని పోరాటం : గులాబీ సైనికులు రాష్ట్ర ప్రజల పక్షాన విరామం ఎరుగని పోరాటం చేస్తున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీల గారడీని ప్రజాక్షేత్రంలో ఎండగట్టారని కేటీఆర్​ అన్నారు. తెలంగాణ ప్రజల గుండెచప్పుడును అడుగుడుగునా ప్రతిధ్వనించారని కొనియాడారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు చేసిన పోరాటాలను చరిత్రపై చెరగని సంతకాలుగా కేటీఆర్ అభివర్ణించారు.

కార్యకర్తల పోరాటాల వల్లే సర్కారు వెనక్కి తగ్గింది : తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను అత్యంత సమర్థంగా తిప్పికొట్టిన సందర్భాలు పోరాటపథంలో నిలిచి ఉండే మైలురాళ్లు అని కేటీఆర్​ అన్నారు. తెలంగాణ ప్రజల కోసం గల్లీ నుంచి దిల్లీ వరకు బీఆర్ఎస్ శ్రేణులు మోగించిన “జంగ్ సైరన్” ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టించిందని కేటీఆర్​ వ్యాఖ్యానించారు. నేతలు, కార్యకర్తల అలుపెరగని పోరాటాల వల్లే అదానీ విరాళం, లగచర్ల లడాయిలో సర్కార్ వెనక్కు తగ్గిందని కేటీఆర్ తెలిపారు. అక్రమ కేసులు పెట్టినా వేధించాలని చూసినా మొక్కవోని ధైర్యంతో నిలబడ్డ తీరు అపూర్వమని బీఆర్ఎస్ శ్రేణులను ప్రశంసించారు.

అలుపెరగని పోరాట యోధులు : దశాబ్దాలపాటు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కుక్కలు చింపిన విస్తరిలా మార్చే కాంగ్రెస్ కుట్రలను అడుగడుగునా ప్రశ్నించి అడ్డుకుందామని కేటీఆర్ పిలుపునిచ్చారు. కార్యకర్తలే పార్టీకి పునాది రాళ్లు, మూలస్తంభాలు అన్న ఆయన గులాబీ జెండాకు వెన్నముక అని వ్యాఖ్యానించారు. పార్టీ తరపున నిలబడి కలబడే నేటి అలుపెరగని పోరాట యోధులే రేపటి తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై బీఆర్ఎస్ పక్షాన మెరిసే వజ్రాయుధాలు అని కేటీఆర్ పేర్కొన్నారు.

ఫార్ములా ఈ రేస్​ కేసును న్యాయపరంగా ఎదుర్కొంటా - ఈ ఏడాది ఉప ఎన్నికలు రావచ్చు: కీటీఆర్

సినిమా వాళ్లతో సెటిల్మెంట్ చేసుకొని ఇప్పుడు మాట్లాడట్లేదు : కేటీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.