NTR Neel Movie : 'సలార్'తో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఈ సారి ఆయన అప్‌కమింగ్ మూవీ కోసం మరో మాలీవుడ్ స్టార్‌ను రంగంలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ నీల్ కాంబోలో తెరకెక్కన్నున్న సినిమా కోసం ఆయన్ను సంప్రదించగా, ఆ స్టార్ హీరో ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్లు సమాచారం.
ఇంతకీ ఆయనెవరో కాదు యంగ్ హీరో 'టొవినో థామస్'. తాజాగా ఈ ఇద్దరూ కలిసి దిగిన ఓ ఫొటో నెట్టింట తెగ సందడి చేసింది. దీంతో ఈ సినిమాలో ఆయన రోల్ పక్కా అని అభిమానులు అంటున్నారు. ఇప్పుడు ఈ వార్త విని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో టొవినో ఎటువంటి పాత్రలో కనిపించనున్నారో అంటూ ఎగ్జైటెడ్‌గా ఎదురుచూస్తున్నామని అంటున్నారు.
#TovinoThomas to be part of #PrashanthNeel ‘s pan-India film with #NTR! pic.twitter.com/dvyyRsHM9S
— Sreedhar Pillai (@sri50) February 5, 2025
స్ట్రెయిట్ సినిమాల ద్వారా ఇక్కడివారికి సుపరిచితం కానప్పటికీ 'మిన్నల్ మురళి', '2018', 'ఎ.ఆర్.ఎమ్' మలయాళ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీస్ ద్వారా ఆయన పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోయింది. ముఖ్యంగా 'మిన్నల్ మురళీ' సినిమాకు టాలీవుడ్‌లోనూ మంచి వ్యూవర్షిప్ దక్కింది. ఇక తాజాగా విడుదలైన 'ఏఆర్ఎమ్'తోనూ తెలుగు ప్రేక్షకులకుమరింత చేరువయ్యారు. ఈ సినిమాను తెలుగులో డబ్ చేయగా, దానికి ఇక్కడ మంచి వ్యూవ్స్ దక్కాయి.
సినిమా విషయానికి వస్తే, 'ఎన్టీఆర్ 31'గా రూపొందుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో తారక్ మునుపెన్నడూ చేయని శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇందులో ఆయన సరసన కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ కనిపించనున్నారని సమాచారం. బిజు మీనన్ కీలక పాత్రలు పోషించనున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీస్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కడంతో పాటు తారక్- ప్రశాంత్ నీల్ కలిసి ఈ ప్రాజెక్ట్‌కు పని చేస్తుండటం వల్ల అందరికీ దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. సినిమా టైటిల్ నుంచి తారాగణం, కథ వరకూ ఎలాంటి క్లూస్ ఇవ్వకుండా ఉంచడం వల్ల ఈ చిత్రంపై ఆసక్తిని రెట్టింపు అవుతోందని అభిమానులు అంటున్నారు. ముఖ్యంగా ఇందులో తారక్ ఎలా ఉండబోతుంతో తెలుసుకోవాలని ఆశగా ఎదురుచూస్తున్నారని తెలుపుతున్నారు.
చిన్నారుల 'దావూదీ' డ్యాన్స్‌కు తారక్ ఫిదా- సో అడోరబుల్ అంటూ కామెంట్!