ETV Bharat / politics

రైతులకు రెండు సార్లు రైతు భరోసా ఇవ్వకుంటే ఊరుకునేది లేదు: హరీశ్​రావు - HARISH RAO ON RYTHU BHAROSA

రాష్ట్రంలో సగం మందికి కూడా రుణమాఫీ పూర్తి కాలేదన్న బీఆర్ఎస్​ నేత హరీశ్​రావు - ఇప్పుడు రైతుభరోసాకు కూడా షరతులు పెడుతున్నారని వ్యాఖ్య

BRS Leader Harish Rao Comments On Rythu Bharosa
BRS Leader Harish Rao Comments On Rythu Bharosa (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 1, 2025, 6:10 PM IST

BRS Leader Harish Rao On Rythu Bharosa : రాష్ట్రంలో సగం మందికి కూడా రుణమాఫీ పూర్తి కాలేదని బీఆర్ఎస్​ నేత హరీశ్​రావు విమర్శించారు. రుణమాఫీకి షరతులు పెట్టి లబ్ధిదారులను తగ్గించారని ఆరోపించారు. మీడియా సమావేశంలో హరీశ్​రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు. రైతు భరోసాకు కూడా షరతులు పెడుతున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై హరీశ్​రావు మండిపడ్డారు. రైతు భరోసా పథకానికి రైతుల నుంచి సెల్ఫ్​ డిక్లరేషన్ తీసుకుంటారట అని ఆక్షేపించారు.

బడా కంపెనీలు, కార్పొరేట్ వ్యాపారులకు ఎలాంటి షరతులు లేవన్న హరీశ్​రావు రైతులను దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని కాంగ్రెస్​ ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతులను మళ్లీ కార్యాలయాల చుట్టూ తిప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారని ఆక్షేపించారు. ఏ దరఖాస్తు లేకుండా బీఆర్ఎస్​ ప్రభుత్వం రైతుబంధు ఇచ్చిందని హరీశ్​రావు గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకుల చుట్టూ రైతులు తిరగాలని ఈ ప్రభుత్వం చూస్తోందని ఆయన ఆక్షేపించారు.

రైతునోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నారు : వరంగల్​ డిక్లరేషన్​లో చెప్పినవిధంగా ఎకరానికి రూ.15 వేలు చొప్పున ఇవ్వాలని హరీశ్​రావు డిమాండ్ చేశారు. వానాకాలం, యాసంగి పంటలకు కలిపి ఒకేసారి రూ.15 వేల చొప్పున ఇవ్వాలని ఆయన అన్నారు. పత్తి, చెరకు, పసుపు పంటలకు ఒకసారి మాత్రమే రైతు భరోసా ఇస్తామంటున్నారని కాంగ్రెస్​ ప్రభుత్వంపై హరీశ్​రావు మండిపడ్డారు. సాగునీటి సౌకర్యం లేని రైతులు ఒకపంట మాత్రమే సాగు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షరతుల పేరిట రైతునోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

కొండలు, గుట్టలు సాగు చేసేవారికి రైతు భరోసా రాదని చెప్తున్నారన్న హరీశ్​రావు అక్కడ సాగు చేసేది గిరిజన రైతులు మాత్రమేనన్నారు. గిరిజనులకు రైతు భరోసా ఇచ్చేది లేదని చెప్తోందా ఈ ప్రభుత్వం? అని ప్రశ్నించారు. పత్తి, కంది రైతులకు 2సార్లు రైతుభరోసా ఇవ్వకుంటే ఊరుకునేది లేదని హరీశ్​రావు హెచ్చరించారు. రైతుభరోసా వానాకాలం ఎగ్గొట్టి యాసంగిలో సగం మందికి ఇస్తామంటున్నారన్నారు. ఇప్పటివరకు ఎవరికీ వ్యవసాయ పరికరాలు ఇవ్వలేదని హరీశ్​రావు ఆక్షేపించారు. ఉపాధిహామీ పథకాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు. ఉపాధి హామీ నిధులను కాంగ్రెస్​ పక్కదారి మళ్లిస్తోందని విమర్శించారు.

కేసీఆర్ పాలనలో 'ఇరిగేషన్' పెరిగితే - రేవంత్ పాలనలో 'ఇరిటేషన్' పెరిగింది: హరీశ్​ రావు

కాంగ్రెస్​ ప్రభుత్వం చేసే పనులకు - హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్​ గుర్తు పెట్టుకోవాలి : హరీశ్​ రావు - brs meet HYDRA Victims

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.