తెలంగాణ

telangana

ETV Bharat / politics

ఈ నెల 10 నుంచి బండి సంజయ్ పాదయాత్ర​ - BJP MP Tickets Telangana 2024

BJP MP Bandi Sanjay Yatra From Feb 10 : బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్​ మరోసారి యాత్రకు సిద్ధమయ్యారు. ఈ నెల 10 నుంచి కరీంనగర్​ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా ఈ యాత్ర చేపట్టనున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలు యాత్రకు సంబంధించిన షెడ్యూల్​ను సిద్ధం చేశారు.

BJP MP Bandi Sanjay Yatra From Feb 10
ఈ నెల 10 నుంచి యాత్ర చేపట్టనున్న బండి సంజయ్​ - గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు

By ETV Bharat Telangana Team

Published : Feb 6, 2024, 7:34 PM IST

BJP MP Bandi Sanjay Yatra From Feb 10 :బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఈ నెల 10 నుంచి మరోసారి యాత్రకు సిద్ధమయ్యారు. కేంద్ర అభివృద్ది పథకాలను జనంలోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో తిరిగి కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగనుంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాలను, వీలైనన్ని ఎక్కువ గ్రామాల్లో పాదయాత్ర చేసేలా బీజేపీ నేతలు రూట్ మ్యాప్​ను సిద్ధం చేశారు. అందులో భాగంగా కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు నిర్వహించి మేడిపల్లి కేంద్రం నుంచి బండి సంజయ్ తన యాత్రను ప్రారంభించనున్నారు.

ఈ యాత్ర తొలివిడతలో ​వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో ఎంపీ బండి సంజయ్ చేపట్టనున్నారు. సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లల్లిలో తొలి విడత ముగింపు సభను నిర్వహించనున్నారు. తొలి దశలో మొత్తం 119 కిలో మీటర్ల మేరకు యాత్ర చేయనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో యాత్ర చేయడంతో పాటు అధిక సంఖ్యలో గ్రామాల్లోకి వెళ్లి ప్రజలతో మమేకమవుతారు.

BJP Yatra For Parliament Elections : యాత్రలో భాగంగా బండి సంజయ్​ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం గ్రామాల, పట్టణాల అభివృద్దికి వెచ్చించిన నిధులను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు బండి సంజయ్ యాత్రను కొనసాగించేలా బీజేపీ నేతలు షెడ్యూల్​ను రూపొందించారు.

Parliament Elections 2024 :మరోవైపు రానున్న పార్లమెంట్​ ఎన్నికల కోసం కాషాయ దళం ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్రంలో ఉన్న 17 ఎంపీ సీట్లలో మెజార్టీ పార్లమెంట్ స్థానాలు దక్కించుకోవడానికి బీజేపీ దూకుడుగా వెళ్లాలని నిర్ణయించింది. ప్రత్యర్థి రాజకీయ పక్షాల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తోంది. ఎలాంటి వివాదాలకు తావులేని లోక్​సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు సన్నద్ధమైంది. సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ స్థానాలను సిట్టింగులకే కట్టబెట్టాలని నిర్ణయించింది. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డిని, కరీంనగర్ నుంచి బండి సంజయ్​ను, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్​ను రాష్ట్ర పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించినట్లు సమాచారం.

BJP MP Tickets Telangana 2024 :మరో సిట్టింగ్‌ స్థానం ఆదిలాబాద్‌లో సోయం బాపురావు స్థానంలో కొత్త అభ్యర్థిని బరిలో దించేందుకు జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. చేవెళ్ల, మహబూబ్ నగర్, భువనగిరి, మెదక్, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాలకు ఒక్కో పేరు చొప్పున రాష్ట్ర నాయకత్వం కేంద్ర పార్టీకి జాబితాను పంపించినట్లు తెలుస్తోంది.

ప్రాజెక్టుల పేరుతో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ నాటకాలు ఆడుతున్నాయి : బూర నర్సయ్య

రానున్న రోజుల్లో ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం ఉంది : కిషన్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details