BJP Lok Sabha Election Review: కేంద్రంలో మూడోసారి అధికారం కైవసం చేసుకుని హ్యాట్రిక్ కొట్టాలని కమల దళం భావిస్తోంది. సొంతంగా 370 సీట్లు, కూటమిగా 4 వందల సీట్లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఈ రాష్ట్రంలోని 17 స్థానాల్లో 12 స్థానాల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలకు, ప్రతి వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతోంది. అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. రాష్ట్రం నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో దాదాపు ఏడుగురు ఎన్నికల ముందు ఆ పార్టీలో చేరినవారే.
రాష్ట్రంలో అగ్ర నాయకుల ప్రచారం : లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ. నడ్డా ఒక దఫా ఎన్నికల ప్రచారాన్ని ముగించారు. మోదీ ఎన్నికల షెడ్యూల్‌కు ముందు రాష్ట్రానికి మూడుసార్లు వచ్చారు. ఐదు బహిరంగ సభలు, మల్కాజిగిరి రోడ్ షోలో పాల్గొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ తరువాత మూడుసార్లు రాష్ట్రానికి వచ్చారు. జహీరాబాద్, వేములవాడ, వరంగల్, నారాయణ పేట, హైదారాబాద్ ఎల్బి స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్లలో తెలంగాణ అభివృద్ది కోసం కేటాయించిన నిధులను వివరించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపైన తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు.
మోదీ హయాంలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి : జేపీ నడ్డా - JP Nadda Election Campaign
Telangana Lok Sabha Election BJP Target Seats: జేపీ. నడ్డా, అమిత్ షా, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు అభ్యర్థుల తరుపున ప్రచారాన్ని హోరెత్తించారు. సభలు, సమావేశాలు, ర్యాలీల్లో పాల్గొని మోదీ చేసిన అభివృద్ధిని వివరించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ అనుబంధ సంఘాలైన ఏబీవిపీ, యువ, మహిళా, కిసాన్, మైనార్టీ మోర్చా కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ప్రతి ఓటర్‌ను కలిసి కమలం గుర్తుకి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ ప్రకటించింది. ప్రజల నుంచి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు సేకరించి అందులో నుంచి అవసరాలను తీర్చే అంశాలను పరిగణనలోకి తీసుకుని పొందు పరిచింది.