తైవాన్లో భారీ భూకంపం సంభవించింది.. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో సంభంవించింది.. ఈ విపత్తులో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా. సుమారు 736 మందికి గాయాలయ్యాయి.. భూకంపం ధాటికి 25కుపైగా భవనాలు నేలమట్టమయ్యాయి.. మరికొన్ని భవనాలు ఒకవైపునకు ఒరిగిపోయాయి.. భూకంపం ధాటికి వంతెనలు ఊగిపాయాయి. విపత్తు సంభవించిన సమయంలో తైపీ నగరంలోని ఓ తీగల వంతెన కొన్ని నిమిషాల పాటు కదిలింది.. భూకంపం దాటికి ప్రజలు భయాందోళనలతో ఇళ్లను వదిలి పరుగులు పెట్టారు.. హాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.. భూకంపం వల్ల మెట్రో బ్రిడ్జి ఫ్లైఓవర్ ఊగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.. భూకంప తీవ్రత నేపథ్యంలో తైవాన్ వ్యాప్తంగా రైలు. సబ్వే సేవలను నిలిపివేశారు.. జపాన్ దక్షిణ ప్రాంతంలోని పలు దీవుల్లోనూ ప్రకంపనలు కన్పించాయి.. ఫిలిప్పీన్స్ కూడా సునామీని హెచ్చరికలు జారీ చేసింది.. జపాన్ దక్షిణ ద్వీప సమూహం ఒకినావాకు సునామీ హెచ్చరిక జారీ చేసింది.. భూకంపం తర్వాత 3 మీటర్ల వరకు సునామీ వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ అంచనా వేసింది.