అమెరికాలో మరోసారి బద్ధలైన అగ్నిపర్వతం- ఎగసిపడుతున్న లావా - US VOLCANO ERUPTION
US Volcano Eruption : అమెరికా, హవాయిలోని బిగ్ ఐల్యాండ్‌లో కిలోవెయా అగ్నిపర్వతం బద్ధలైంది. దీనితో భారీగా లావా ఉబికివస్తోంది. కిలోవెయా విస్ఫోటనం చెందిన సమయంలో దాదాపు 260 అడుగుల ఎత్తు మేర లావా ఎగసిపడింది. ఆ ప్రాంతమంతా ఎర్రటి వర్ణాన్ని సంతరించుకుంది. అగ్నిపర్వతం నుంచి భారీగా పొగ , ధూళి, విష వాయువులు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో సమీపంలోని ప్రజలను, జంతువులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. (Associated Press)
Published : 14 hours ago