ఫుల్ ఫ్రీగా సిరియా ప్రజలు- అందరితో ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఎంజాయ్! - NEW ERA FOR SYRIA AFTER ASSAD FALL
Syria After Assad : సిరియాలో నిరంకుశమైన అసద్ పాలన అంతమవడం వల్ల ఆ దేశ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ కొత్త శకానికి నాంది పలికారు. ఇంతవరకు అసద్ అరాచకపు పాలనలో మగ్గిన పౌరులకు రెబల్స్ తిరుగుబాటుతో భవిష్యత్తుపై ఆశలు చిగురించాయి. అసద్ పాలన కుప్పకూలి వారం రోజులు అవగా సిరియాలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. రహదారులపైకి వచ్చిన ప్రజలు ఒకరితో ఒకరు ఆప్యాయంగా మాట్లాడుకుంటున్నారు. (Associated Press)
Published : 1 hours ago