జర్నలిజం ఉద్యోగం కాదు. ప్రజా సంక్షేమ జీవన విధానం - రామోజీ రావు. సవాళ్లు లేని జీవితం నిస్సారం - రామోజీ రావు. క్రమ శిక్షణ. కష్టపడటం. కలిసి పని చేయడం విజయానికి మూలకారణాలు - రామోజీ రావు. మనందిరిలోనూ అపరిమితమైన శక్తి ఉంటుంది. దాన్ని తెలుసుకోవడంలోనే అంతా ఉంది. మనకేం కావాలో ఏం వద్దో మన శరీరమే చెబుతుంది. గ్రహించగలిగే శక్తి ఉంటే. ఆ ప్రకారం నడచుకుంటే అంతా సవ్యంగానే ఉంటుంది. ఎంత చెయ్యాలన్న దానికి పరిమితులు. కొలమానాలు లేవు. చెయ్యాలన్న చిత్తశుద్ధి. చేసి చూపాలన్న దృఢ సంకల్పం మాత్రమే కావాల్సింది - రామోజీ రావు. గెలుపు సాధించడం కన్నా దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా ముఖ్యం - రామోజీ రావు. సాహసవంతుల్ని కార్యసాధకుల్ని మాత్రమే విజయం వరిస్తుంది - రామోజీ రావు. విమర్శని స్వీకరించకపోతే ప్రగతి లేదు. వెనక్కి తిరిగి చూసుకుంటే సంతృప్తిలేని జీవితం వృథా - రామోజీ రావు. ప్రతిదీ ప్రభుత్వమే చేయాలని దాదాపు ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. ఇది తమ అసమర్థతను పరోక్షంగా అంగీకరించడమే - రామోజీ రావు. శాస్త్ర పరిశోధనలకు పల్లె బతుకులే ముడిసరుకు కావాలి. గ్రామీణ జీవితమే ప్రయోగాలకు గీటురాయి కావాలి. గ్రామీణ విప్లవ సాధనకు ప్రతి శాస్త్రవేత ఒక సామాజికవేత్త కావాలి - రామోజీ రావు. కర్ర పెత్తనంతో భయపెట్టి సాధించగలిగేది ఏమీ లేదు. కోపంతో అదుపు తప్పే వ్యక్తి నాయకునిగా ఎదగలేడు - రామోజీ రావు. ఏదో ఒకటి చేయాలన్న తపన. ఏదైనా సాధించినప్పుడు పొందే తృప్తి. వీటిని మించిన ప్రోత్సాహకాలు లేవు - రామోజీ రావు