"నన్ను భుజాల మీదు ఎత్తుకొని పెంచావు. అమ్మ. నాన్నలా నన్ను సాకావు. నీ ప్రేమే నాకు కొండంత అండ. నన్ను దీవించు అన్నయ్యా." - హ్యాపీ రక్షాబంధన్. "అమ్మ తర్వాత అమ్మవి నువ్వు.. నన్ను కంటికి రెప్పలా చూసుకున్నావు. నా అల్లరిని ఎన్నోసార్లు భరించావు. నాకు కష్టం వస్తే తట్టుకోలేవు. అక్కా నువ్వు నా ప్రాణం" - రాఖీ శుభాకాంక్షలు. "ఈ ప్రపంచంలోనే మంచి చెల్లెలు నాకుంది. నువ్వు లేకుండా నా జీవితం లేదు. - హ్యాపీ రక్షాబంధన్ చెల్లి". "మన మధ్యనున్న ప్రేమ బంధం ప్రతి ఏడాదీ బలపడుతూనే ఉంది. మనం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ.. - రక్షాబంధన్ శుభాకాంక్షలు తమ్ముడు". "అమ్మలో మొదటి అక్షరం.. నాన్నలో చివరి అక్షరం.. అన్నగా మారి అమ్మానాన్నలా చూసుకుంటావు. నీ ప్రేమను మరిచిపోలేను అన్నా" - హ్యాపీ రక్షాబంధన్. "మన ఇరువురి మధ్య ప్రేమ. అనుబంధం కలకాలమూ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా.. నీకు రక్షాబంధన్ శుభాకాంక్షలు". "నా జీవితంలో నువ్వు ఎంతో ప్రత్యేకం. నువ్వు ఎప్పుడూ నవ్వుతూ.. ఆనందంగా. ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా.. హ్యాపీ రక్షాబంధన్". "ప్రియమైన అన్నయ్యా.. నేను నీకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తానని ఈ రక్షా బంధన్ సాక్షిగా వాగ్దానం చేస్తున్నాను. రాఖీ పండుగ శుభాకాంక్షలు!". "నీ లాంటి అక్క ఉండటం నా అదృష్టం. నువ్వు జీవితాంతం ఆనందంగా ఉండాలని కోరుకుంటూ.. హ్యాపీ రక్షా బంధన్". "నీ అల్లరే నాకు సంతోషం. ఎప్పటికీ నువ్వు నవ్వుతూనే ఉండాలి. నీ కష్ట సుఖాల్లో తోడుగా ఈ అన్నయ్యా ఉన్నాడు. చిట్టి తల్లికి.. రక్షాబంధన్ శుభాకాంక్షలు". "నా ప్రియమైన సోదరుడికి రక్షాబంధన్ శుభాకాంక్షలు. నువ్వెప్పుడూ సంతోషంగా. క్షేమంగా ఉండాలని ఈ రాఖీ సందర్భంగా ప్రత్యేకంగా కోరుకుంటున్నా.". "మన బంధం ఇలాగే సాగాలి అన్నయ్యా.. కష్ట నష్టాల్లో. ఆపదల సమయంలో ఒకరికి ఒకరం తోడుగా ఉందాం" - రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు