Horoscope Today November 29th 2024 : నవంబర్ 29వ తేదీ (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కుటుంబంతో విలువైన సమయం గడుపుతారు. ప్రతీ క్షణం సరదాగా గడిచిపోతుంది. ఉగ్యోగంలో పదోన్నతులు, బదిలీలు ఉండవచ్చు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చిత్తశుద్ధితో పనిచేసి మీ రంగాలలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగస్థులకు అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. స్థానచలనం సూచన ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన శ్రేయస్కరం.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ రోజు తమ తమ రంగాలలో కొత్త పనులు ప్రారంభించకపోవడమే మంచిది. వృత్తి పరంగా, కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యల నిమిత్తం అధిక ఖర్చులు ఉండవచ్చు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. అనవసరంగా గొడవలు పెట్టుకొని నలుగురిలో అవమానపడే పరిస్థితి రానివ్వకండి. అభయ ఆంజనేయ స్వామి ఆరాధన మేలు చేస్తుంది.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలం కాదు. అన్ని వైపులా నుంచి సంకట పరిస్థితులు ఎదురు కావడం వల్ల మానసిక ఆందోళనకు గురవుతారు. కుటుంబసభ్యులతో గొడవ పడతారు. ఈ రోజు ధననష్టం సంభవించే పరిస్థితి ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండండి. సహనంతో ఉంటే అన్నీ సర్దుకుంటాయి. భూ వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్యాష్టకం పఠించడం శ్రేయస్కరం.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు అందుకుంటారు. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. వృత్తి పరంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. స్నేహితులు, ప్రియమైనవారితో విహారయాత్రకు వెళ్తారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. మాతృవర్గం నుంచి అందిన శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. శ్రీలక్ష్మి గణపతి ఆలయ సందర్శన శుభకరం.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా సమావేశాలు, సదస్సులలో మీ వాక్చాతుర్యంతో అందరిని కట్టిపడేస్తారు. మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతాయి. మీ అధికార పరిధి విస్తరిస్తుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు, వ్యాపారస్థులకు ఈ రోజు అంత అనుకూలంగా లేదు. వృత్తిలో పోటీ, సవాళ్లు ఎక్కువగా ఉంటాయి. కళారంగం వారికి, సాహితి రంగం వారికి ఈ రోజు కలిసి వస్తుంది. నూతన అవకాశాలు అందుకుంటారు. సామాజికంగా గుర్తింపు పొందుతారు. ఒక కీలక వ్యవహారంలో ఆర్థికంగా లబ్ది పొందుతారు. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనారోగ్యరీత్యా ఆసుపత్రికి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో గొడవకు దారితీసే పరిస్థితులు ఉన్నాయి అందుకే మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి మీ శారీరక, మానసిక ఆరోగ్యం కూడా అంత అనుకూలంగా ఉండదు. వినోదాల కోసం అధికంగా డబ్బు ఖర్చు చేస్తారు. సన్నిహితులు, ప్రియమైన వారితో అపోహలు ఏర్పడతాయి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ఆపదలు తొలగిపోతాయి.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు లాభదాయకమైన రోజు. కుటుంబ జీవితాన్ని ఈ రోజు సంపూర్ణంగా ఆనందిస్తారు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. విందువినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగ వ్యాపారాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. హోదా పెరుగుతుంది. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. ఈశ్వర ఆరాధన శుభప్రదం.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్థులకు ఈ రోజు ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. ఆరోగ్యం కూడా కొంత సమస్యాత్మకంగా ఉంటుంది. యాక్సిడెంట్లు జరిగే ప్రమాదముంది. అందుకే అప్రమత్తంగా ఉండండి. ప్రమాదకరమైన వ్యవహారాలు, సందర్భాలకు దూరంగా ఉండటం మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో మెరుగైన ప్రయోజనాలు ఉంటాయి.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బంధు మిత్రులతో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. బిజినెస్ ఫండ్స్ సేకరణ నిమిత్తం వివిధ ప్రాంతాలు తిరుగుతారు. వృత్తి పరంగా చాలా ధనం సంపాదించవచ్చు. గౌరవం పెరుగుతుంది. మీ పనితీరుకు పై అధికారులు సంతోషిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశం ఉంది. వాహన ప్రమాదాలకు దూరంగా ఉండండి. దుర్గాస్తుతి పారాయణ మేలు చేస్తుంది.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గ్రహ సంచారం అనుకూలంగా లేనందున చేపట్టిన పనుల్లో ఆలస్యం, ఆటంకాలతో ఇబ్బంది పడతారు. కోర్టు వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. ముఖ్యమైన పనులు చేపట్టకూడదు. స్నేహితులను ఎక్కువగా నమ్మడం ఇబ్బందికర పరిస్థితులకు గురి చేయవచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. ఇష్ట దేవతారాధన శుభకరం.