తెలంగాణ

telangana

ETV Bharat / photos

శీతాకాలంలో మీ జుట్టుకు నూనె రాస్తున్నారా? ఎన్ని లాభాలో తెలుసా?

Benefits Of Apply Oil On Hair Winter Season : చ‌లి కాలం వ‌చ్చిందంటే చాలు ద‌గ్గ‌ర్లోని కిరాణా షాపులలోనో లేదా సూప‌ర్ మార్కెట్​లోనో మాయిశ్చ‌రైజ‌ర్, బాడీలోష‌న్ కొనుక్కుంటాం. శీతాకాలం ముగిసేంత వ‌ర‌కూ వాటిని వాడుతూ చ‌ర్మాన్ని సంర‌క్షించుకుంటాం. కానీ అదే స‌మ‌యంలో జుట్టుపై కూడా చలి ఎఫెక్ట్ ఉంటుంది. మరి హెయిర్​ను సంర‌క్షించుకోవాల‌నే విష‌యం ఎంత మందికి తెలుసు? అందుకు చిట్కాలు ఏమైనా ఉన్నాయా?

By ETV Bharat Telugu Team

Published : Jan 27, 2024, 7:22 PM IST

జుట్టు పెరుగుద‌ల‌కు, సంర‌క్ష‌ణకు హెయిల్​ ఆయిల్స్ తోడ్ప‌డ‌తాయి. వాతావ‌ర‌ణం, మ‌రే ఇత‌ర కార‌ణాల వల్లకానీ చాలా మంది చ‌లికాలంలో నూనె రాసుకోరు. శీతాకాలంలో మీ జుట్టుకు ఆయిల్ అప్లై చేయ‌డం వ‌ల్ల అనేక ప్రయోజనాలున్నాయి.అవేంటంటే?
చ‌లికాలంలో ఉండే పొడి, గాలులు జుట్టు స‌హ‌జ తేమ‌ను త‌గ్గిస్తాయి. దీని వ‌ల్ల జుట్టు పొడిబారిపోతుంది. అప్పుడు నూనె రాయడం వ‌ల్ల జుట్టులోని తేమ‌ బ‌య‌టికి పోకుండా ఉంటుంది. ఫలితంగా జుట్టు సిల్కీగా త‌యార‌వుతుంది.
చుండ్రు నివారణకు : చ‌ల్ల‌గా, పొడిగా ఉండే వాతావ‌ర‌ణం పొడి జుట్టుకు కార‌ణ‌మ‌వుతుంది. దీని వ‌ల్ల చుండ్రు రావ‌డం సహా చికాకుగా అనిపిస్తుంది. నూనె రాసుకుని మసాజ్​ చేసుకుంటే తలపై ర‌క్త ప్ర‌స‌ర‌ణ మెరుగ‌వుతుంది.
చాలా మంది జుట్టు కొసళ్లకు నూనె రాయరు. దీంతో కొసళ్లు బ‌ల‌హీనంగా త‌యారై జుట్టు ఊడిపోతుంది. నూనె జుట్టు కొస‌ళ్ల‌కు రాయడం వల్ల చిక్కులు పడవు. జుట్టు కూడా బ‌లంగా ఉంటుంది.
స‌హ‌జ నిగారింపు : శీతాకాలంలో మ‌న జుట్టు పేల‌వంగా కనిపించ‌డానికి కార‌ణం చలి. జుట్టుకు స‌రైన స‌మ‌యంలో నూనె రాసి కొస‌ళ్ల‌ను స్మూత్​గా ఉంచుకోవాలి. దీని వ‌ల్ల జుట్టుకు ఒక స‌హ‌జ‌మైన నిగారింపు వ‌స్తుంది.
పెళుసుగా ఉండే జుట్టును మెయింటెన్ చేయ‌డం క‌ష్టం. అలాంటి జుట్టుకు ఆయిల్ రాయ‌టం వ‌ల్ల అది మీకు ఒక ర‌క్ష‌ణపొర‌లాగా ప‌ని చేస్తుంది. జుట్టు దువ్వుకోవ‌డం, క్రాఫ్ తీసుకోవ‌డాన్ని మ‌రింత ఈజీ చేస్తుంది.

ABOUT THE AUTHOR

...view details