తెలంగాణ

telangana

ETV Bharat / photos

ఆరని పశ్చిమాసియా అగ్గి! ఏడాదిలో 42వేల మంది బలి - ISRAEL Hamas WAR

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

One Year Of Israel Hamas War : ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య యుద్ధం మొదలై సోమవారంతో ఏడాది పూర్తికానుంది. గత ఏడాది అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ చేసిన మెరుపుదాడి పశ్చిమాసియాను అగ్ని గుండంగా మార్చింది. గాజాపై ఇజ్రాయెల్‌ చేసిన ప్రతీకారదాడుల్లో 42వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ యుద్ధం కాస్త లెబనాన్‌, యెమన్‌, ఇరాన్‌కూ విస్తరించి, ఇప్పుడది ప్రాంతీయ యుద్ధం స్థాయికి చేరింది. (Associated Press)
ఇజ్రాయెల్‌లోని మ్యూజిక్‌ ఫెస్టివల్‌పై హమాస్‌ దాడి చేసి సోమవారం (అక్టోబరు 7) నాటికి ఏడాది పూర్తి కానుంది (Associated Press)
గత ఏడాది అక్టోబర్‌ 7న ఉదయం ఊహించని రీతిలో ఇజ్రాయెల్‌పై హమాస్‌ చేసిన దాడి పశ్చిమాసియాను అగ్నిగుండంగా మార్చింది. (Associated Press)
చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఇజ్రాయెల్‌పై ఒక్కసారిగా హమాస్‌ మిలిటెంట్లు వేలాది రాకెట్లతో విరుచుకుపడ్డారు. (Associated Press)
వందలాది హమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌లోకి చొరబడి మారణహోమం సృష్టించారు. (Associated Press)
దాదాపు 1200 మందిని హతమార్చారు. 250 మందికిపైగా ఇజ్రాయెల్‌ పౌరులను బందీలుగా తీసుకెళ్లారు. (Associated Press)
ఇప్పటికీ దాదాపు 100 మంది ఇంకా హమాస్‌ చెరలోనే బందీలుగా ఉన్నారు. వారిలో 70 మందే బతికి ఉన్నట్లు తెలుస్తోంది. (Associated Press)
ఈ పరిణామంతో ఇజ్రాయెల్‌ హమాస్‌ మిలిటెంట్‌ సంస్థను రూపుమాపడమే లక్ష్యంగా గాజాపై అక్టోబర్ 27న యుద్ధానికి దిగింది. (Associated Press)
హమాస్‌ మిలిటెంట్‌ సంస్థ సొరంగ నెట్‌వర్క్‌ను ఇజ్రాయెల్‌ పూర్తిగా ధ్వంసం చేసింది. (Associated Press)
ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా గాజాలో 42 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. (Associated Press)
గాజా జనాభా 23 లక్షల మందికాగా వారిలో 90 శాతం మంది తమ ఇళ్లను వీడాల్సి వచ్చింది. (Associated Press)
లక్షల మంది తాత్కాలిక శిబిరాల్లోనే ఆశ్రయం పొందుతున్నారు. భవనాలన్నీ నేలమట్టమయ్యాయి (Associated Press)
ఇప్పుడు యుద్ధం ముగిసినా గాజా కోలుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందో చెప్పడం కష్టం. (Associated Press)
ఇజ్రాయెల్‌ను చావు దెబ్బ తీయాలని ప్రయత్నించిన హమాస్‌ తానే చావు దెబ్బ తింది. (Associated Press)
గత ఏడాది నవంబరు 24న కొన్ని రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదరగా 80 మంది బందీల విడుదలయ్యారు. (Associated Press)
240 మంది పాలస్తీనా ఖైదీలను హమాస్‌కు ఇజ్రాయెల్‌ అప్పగించింది. (Associated Press)
ఇజ్రాయెల్, హమాస్‌ ఘర్షణ యుద్ధంగా మారి పశ్చిమాసియాను అగ్ని గుండంగా మార్చింది. ప్రాంతీయ యుద్ధం స్థాయికి చేరింది. (Associated Press)
ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో ప్రపంచానికి భారీ నష్టం జరగ్గా పశ్చిమాసియా ఘర్షణతో అది మరింత తీవ్రమైంది. (Associated Press)
యుద్ధానికి ఏడాది పూర్తవుతుండడం వల్ల ఇజ్రాయెలీల్లో అసహనం, నైరాశ్యం కనిపిస్తున్నాయి. (Associated Press)
ఇంకా బందీలను విడిపించుకోలేకపోవడం, ఇటు హెజ్‌బొల్లాతో యుద్ధం ప్రారంభం కావడం వారిని ఇబ్బందికి గురి చేస్తోంది (Associated Press)
ఇరాన్‌తోపాటు హెజ్‌బొల్లా, హూతీల నుంచి క్షిపణి దాడులను ఇజ్రాయెలీలు చవిచూస్తున్నారు. (Associated Press)
యుద్ధం దీర్ఘకాలం కొనసాగడంపై ఇజ్రాయెలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (Associated Press)
61 శాతం మంది ఇజ్రాయెలీలు యుద్ధాన్ని సమర్థిస్తున్నా దాని ప్రభావంపట్ల వారిలో ఆందోళన నెలకొంది. (Associated Press)
యుద్ధం ప్రారంభం నుంచి హమాస్‌కు ఇరాన్‌ మద్దతిస్తూ వస్తోంది. తొలుత ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనని ఇరాన్‌ హమాస్‌, హెజ్‌బొల్లా, హూతీలకు అండగా నిలిచింది. (Associated Press)
ఈ ఏడాది జులై 30న హెజ్‌బొల్లా కీలక నేత ఫవాద్‌ షుకుర్‌ హత్య జరగ్గా తదుపరి రోజే హమాస్‌ రాజకీయ వ్యవహారాల బాధ్యుడు ఇస్మాయిల్‌ హనియే హతమయ్యారు. (Associated Press)
సెప్టెంబరు 27న లెబనాన్‌ రాజధాని బీరుట్‌పై వైమానిక దాడులు చేసి హెజ్‌బొల్లా అధినేత నస్రల్లాను ఇజ్రాయెల్‌ హత్య చేసింది. (Associated Press)
నస్రల్లా, హనియే హత్యలకు ప్రతీకారంగా 2024 అక్టోబరు 1న ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడులకు పాల్పడింది. (Associated Press)
మరోవైపు లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ భూతల పోరు ప్రారంభించింది. ఇరాన్‌పై ప్రతీకార దాడులు చేయాలని యోచిస్తోంది. (Associated Press)
యుద్ధం కొత్త రూపం తీసుకుని ఇజ్రాయెల్‌, ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రమవుతుందేమోనన్న ఆందోళన ప్రపంచ దేశాలను భయపెడుతోంది. (Associated Press)
ఎర్ర సముద్రంలో అనేక వాణిజ్య నౌకలపై హుతీ తిరుగుబాటుదారులు దాడులకు పాల్పడ్డారు. (Associated Press)
గాజాతోపాటు లెబనాన్‌ సరిహద్దు, ఎర్ర సముద్రం, యెమన్‌, ఇరాన్‌ యుద్ధ క్షేత్రాలుగా మారాయి. (Associated Press)
ప్రస్తుతం యుద్ధం పాశ్చాత్య దేశాలు అండగా నిలిచే ఇజ్రాయెల్‌కు, చైనా, రష్యా మద్దతిచ్చే ఇరాన్‌కు మధ్యగా మారింది. (Associated Press)
ఇజ్రాయెల్‌కు అమెరికా, ఇరాన్‌కు రష్యా ఆయుధాలను సమకూరుస్తామని హామీ ఇచ్చాయి. (Associated Press)
ఈ యుద్ధం ఇంకెంత తీవ్రతరం అవుతుందోనని సర్వత్రా ఆందోళన నెలకొంది. (Associated Press)
ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం (Associated Press)
ఇజ్రాయెల్ గాజా యుద్ధం (Associated Press)
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం (Associated Press)
లెబనాన్​పై ఇజ్రాయెల్ దాడి (Associated Press)
ఇజ్రాయెల్ గాజా యుద్ధం (Associated Press)
ఇజ్రాయెల్ గాజా యుద్ధం (Associated Press)
ఇజ్రాయెల్ గాజా యుద్ధం (Associated Press)

ABOUT THE AUTHOR

...view details