Pratidwani On Telugu Language Day :తమ భావాలను ఇతరులతో పంచుకునేందుకు తోడ్పడే మాధ్యమమే భాష. ప్రజల ఆచార వ్యవహారాలు, జీవనవిధానంలోనూ భాష కీలక పాత్ర పోషిస్తుంది. తల్లి నుంచి పిల్లలు నేర్చుకునేదే మాతృభాష. ప్రపంచీకరణ ప్రభావం మన తెలుగు భాషపై కూడా ఉంది. ఆధునిక, సాంకేతిక యుగంలో మాతృభాష పలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.
తేనెలొలుకు తెలుగు - తరతరాలకు వెలుగు - అమ్మ భాషను కాపాడుకునేదెలా? - Pratidhwani On TELUGU LANGUAGE DAY - PRATIDHWANI ON TELUGU LANGUAGE DAY
Pratidwani On Telugu Language Day : నది అయినా భాష అయినా జీవధారలుగా ప్రవహిస్తున్నంత వరకే వాటికి ఉనికి. ఆ ప్రవాహం పరంపర ఎక్కడ ఆగిపోతుందో అక్కడితో గడ్డురోజులు మొదలైనట్లే. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్‌గా వినుతికెక్కిన తెలుగుభాష కూడా అందుకు మినహాయింపు కాదు. శరవేగంగా మారుతోన్న ఆధునిక, సాంకేతిక యుగంలో మాతృభాషలు ఎదుర్కొంటున్న సవాళ్లే అందుకు కారణం. మరి ఏం చేస్తే మన భాష బతుకుతుంది?
Published : Aug 29, 2024, 10:41 AM IST
అది నదులు అయినా భాష అయినా జీవధారలుగా ప్రవహిస్తున్నంత వరకే వాటికి ఉనికి. ఆ ప్రవాహం పరంపర ఎక్కడ ఆగిపోతుందో చిక్కిపోతుందో అక్కడితో గడ్డురోజులు మొదలైనట్లే. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్‌గా వినుతికెక్కిన తెలుగుభాష కూడా అందుకు మినహాయింపు కాదు. శరవేగంగా మారుతోన్న ఆధునిక, సాంకేతిక యుగంలో మాతృభాషలు ఎదుర్కొంటున్న సవాళ్లే అందుకు కారణం. మరి ఏం చేస్తే మన భాష బతుకుతుంది? తెలుగుభాషా దినోత్సవం సందర్భంలో భాషా ప్రేమికులను కలవర పెడుతోన్న అంశమూ ఇదే. మరీ ముఖ్యంగా ఆధునిక, టెక్ తరానికి, వారి అవసరాలకు తగిన రీతిలో భాషాభివృద్ధి జరిగిందా? లోపం ఎవరిది? దోషం ఎక్కడుంది? ఇకపై జరగాల్సిందేమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.