తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఓవైపు వరదల బీభత్సం! - మరోవైపు విషజ్వరాలు - కట్టడికి మార్గాలేంటి? - Viral Fevers in Telangana - VIRAL FEVERS IN TELANGANA

Viral Fevers in Telangana : వర్షాకాలం వచ్చిందంటే సీజ‌న‌ల్ వ్యాధులు విజృభిస్తుంటాయి. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనావాసాలు రోజుల తరబడి నీళ్లల్లోనే నానుతున్నాయి. వీటికి తోడు మలేరియా, స్వైన్ ఫ్లూ, డెంగీలు కూడా త‌మ ప్రతాపాన్ని చూపిస్తుండ‌టంతో జ‌నాలకు తిప్పలు తప్పడం లేదు. ఈ సమయంలో మన ఆరోగ్యానికి మనమే రక్షగా ఉండాలి. మన జాగ్రత్తలు మనమే తీసుకోవాలి. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

Viral Fevers in Telangana
Prathidwani Debate on Viral Fevers in Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 5, 2024, 10:00 AM IST

Pratidwani Debate on Viral Fevers in Telangana: అసలే వ్యాధుల కాలం! ఆ పై వరదల బీభత్సం! తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితి ఇదే. నిన్నా మొన్నటి వరకు వణికించిన డెంగీ, విష జ్వరాల కష్టం చాలదన్నట్లు పీకల్లోతు నీటిలో మునిగి పోయాయి. జనావాసాలు రోజుల తరబడి నీళ్లల్లోనే నానుతున్నాయి. ఆ వరదలు అవి మోసుకు వచ్చిన బురద ప్రజారోగ్యానికి సవాళ్లు విసురుతున్నాయి.

సాధారణంగానే ఇలాంటి సందర్భాల్లో వాతావరణం మారటమే కాదు కలుషితమయ్యే నీరు ముసురుకొచ్చే దోమల దండుతో దాడి చేసే జబ్బులు చాలా ఎక్కువ. అప్పటికే ఉన్న కొన్ని జబ్బులూ తీవ్రం కావొచ్చు. ఈ విపత్కర పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలి? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. మరి, వ్యాధులు ప్రబలే ఈ సమయంలో మన ఆరోగ్యానికి మనమే రక్షగా ఉండాలి. మన జాగ్రత్తలు మనమే తీసుకోవాలి. చాలా వరకు మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details